కొడాలి పంచాయతీ ఎవరితోనో తెలిస్తే?

జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్న ఇద్దరు మంత్రుల మ‌ధ్య మాటా మాటా వ‌చ్చింద‌ట‌. దీంతో ఆ ఇద్దరూ క‌ల‌హించుకుంటున్నార‌ని, ఈ విష‌యం ముఖ్యమంత్రి కార్యాల‌యం(సీఎంవో) వ‌ర‌కు చేరింద‌ని [more]

Update: 2020-01-31 11:00 GMT

జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్న ఇద్దరు మంత్రుల మ‌ధ్య మాటా మాటా వ‌చ్చింద‌ట‌. దీంతో ఆ ఇద్దరూ క‌ల‌హించుకుంటున్నార‌ని, ఈ విష‌యం ముఖ్యమంత్రి కార్యాల‌యం(సీఎంవో) వ‌ర‌కు చేరింద‌ని అంటున్నారు. అయితే, ప్రస్తుతం శాస‌న మండ‌లి వేడి రాజుకోవడంతో ఈ విష‌యానికి అంత‌గా ప్రాధాన్యం ల‌భించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. స‌రే విష‌యంలోకి వెళ్తే కృష్ణాజిల్లా గుడివాడ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొడాలి నాని పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రిగా ఉన్నారు. అయితే, రాజ‌కీయ నేత‌ల్లో ఎక్కువ మందికి రైస్ మిల్లింగ్ వ్యవ‌స్థతో చాలా ద‌గ్గర సంబంధాలు ఉన్నాయి.

బియ్యం కొనుగోలుపై….

దీంతో చాలా మంది మంత్రులు త‌మ జిల్లాలో ధాన్యం సేక‌రించాలని మంత్రిపై ఒత్తిళ్లు తెస్తున్నమాట నిజం. ప్రస్తుతం ప్రభుత్వం తెల్లరేష‌న్ కార్డు దారుల‌కు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్న నేప‌థ్యం లో దాదాపు ఉత్తరాంధ్ర స‌హా, సీమ జిల్లాల్లోని మిల్లర్లు.. రాజ‌కీయంగా మంత్రుల‌పై ఒత్తిడి తెస్తున్నారు. త‌మ బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల‌ని వారు కోరుతున్నారు. దీంతో ఈ విష‌యం ఎంత వ‌ద్దన్నా రాజకీయంగా మారుతోంది.

సత్తిబాబు జోక్యంతో….

ఈ నేప‌థ్యంలోనే స‌ద‌రు మంత్రులు అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా పౌర స‌ర‌ఫ‌రాల మంత్రి కొడాలి నానిపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, కొడాలి నాని వినీ విన‌న‌ట్టే వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇదే విష‌యంలో గ‌తంలో మంత్రి రంగ‌నాథ‌రాజుకు, కొడాలి నానికి మ‌ధ్య వివాదం కూడా న‌డిచింది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌కు, కొడాలి నానికి మ‌ధ్య ఏర్పడింద‌ని అంటున్నారు. పౌర‌స ర‌ఫ‌రాల విష‌యంలో త‌న జిల్లా మిల్లర్లకు అన్యాయం జ‌రుగుతోంద‌ని బొత్స సత్యనారాయణ అంటున్నార‌ట‌. అయితే, ఈ విష‌యంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటార‌ని కొడాలి నాని సీఎంవోలో జ‌గ‌న్ ముందే ప్రశ్నించార‌ట‌. ఈ విష‌యం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే, మండ‌లి ర‌ద్దు నేప‌థ్యంలో ఈ విష‌యం వెలుగు చూడ‌లేదు. ఉ త్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా రైస్ మిల్లుల విష‌యంలో బొత్సకు వ్యాపార భాగ‌స్వాములు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌పై ఒత్తిడి పెరిగింద‌ని, దీంతోనే కొడాలి నానిపై ఆగ్రహంతో ఉన్నార‌ని స‌మాచారం. మ‌రి జ‌గ‌న్ ఎలా స‌రిదిద్దుతారో ? చూడాలి.

Tags:    

Similar News