ఎన్నికల దాకా ఎందుకు..దీని సంగతేంటి?

ఆ రెండు మిత్రపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయడం దేముడెరుగు. ప్రస్తుతం రాజధాని సమస్యపై కలసి పోరాటం చేస్తారా? అన్నది ఏపీలో చర్చనీయాంశమైంంది. ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2020-08-26 11:00 GMT

ఆ రెండు మిత్రపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయడం దేముడెరుగు. ప్రస్తుతం రాజధాని సమస్యపై కలసి పోరాటం చేస్తారా? అన్నది ఏపీలో చర్చనీయాంశమైంంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని రెండు పార్టీల నేతలు ప్రకటించారు. సమస్యలపై కలసి పోరాడాలని నిర్ణయించారు. ఇందుకోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు సమావేశం అవ్వాల్సిన సమన్వయ కమిటీ ఇప్పటి వరకూ సమావేశం కాకపోవడం రెండు పార్టీల్లో చర్చనీయాంశమైంది.

ఇద్దరివీ వేర్వేరు అభిప్రాయాలు….

ఇక్కడ రాజధాని రెండు పార్టీల మధ్య చిచ్చు రేపేలాగానే ఉంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధాని రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరాడుతుందన్నారు. అదే సమయంలో రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని కూడా చెప్పారు. రైతులకు ఏవిధంగా న్యాయం జరగాలన్న దానిపై చర్చించి కార్యాచరణను ప్రకటిస్తామని సోము వీర్రాజు తెలిపారు.

సమన్వయ కమిటీ సమావేశంతో….

మరోవైపు పవన్ కల్యాణ‌్ మాత్రం ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అంటున్నారు. రాజధాని మార్పుపై తాము ఆందోళన చేస్తామని అన్నారు. ఇటీవల సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా పవన్ కల్యాణ్ ను కలసినప్పుడు కూడా రాజధాని అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చింది. రాజధాని విషయంలో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. తమ పార్టీ తరుపున నాదెండ్ల మనోహర్ వస్తారని కూడా పవన్ కల్యాణ‌్ సోము వీర్రాజుకు తెలిపారు.

కార్యాచరణ కష్టమేనా…?

కానీ ఇద్దరు కలసి కార్యాచరణను సిద్ధం చేయడం కష్టంగా మారింది. అమరావతి విషయంలో ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్నది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచన గా ఉంది. ఇందుకోసం తాను ఆమరణ దీక్షకైనా దిగుతానని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సోము వీర్రాజు మాత్రం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది బీజేపీ డిమాండ్ అని, రాజధాని విషయంలో తాము కల్పించుకోమని అంటున్నారు. మరి ఈ రెండు పార్టీలు కలసి కార్యచరణను ఎలా రూపొందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News