టీడీపీకి వైసీపీ నేతల లీకులు.. కడుపుమంటకు కారణమేంటి..?
ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు.. ప్రతిపక్షం టీడీపీకి అందుతున్న ప్రధాన విషయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంతేకాదు.. ఇంత కీలక విషయాలు ఎలా చేరుతున్నాయి ? [more]
ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు.. ప్రతిపక్షం టీడీపీకి అందుతున్న ప్రధాన విషయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంతేకాదు.. ఇంత కీలక విషయాలు ఎలా చేరుతున్నాయి ? [more]
ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు.. ప్రతిపక్షం టీడీపీకి అందుతున్న ప్రధాన విషయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంతేకాదు.. ఇంత కీలక విషయాలు ఎలా చేరుతున్నాయి ? ఇంత భారీ ఎత్తున విమర్శలు చేయగలుగుతున్నారు ? అనే కోణంలో ప్రశ్నలు వస్తే.. ఎక్కడో ఏదో జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. అంటే.. వైసీపీలోనే కొందరు లీకులు ఇస్తున్నారని.. దీంతో టీడీపీ నేతలు ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల కర్నూలుకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం విషయంలో రెండు కీలక విషయాలను టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధారాలతో సహా బయట పెట్టారు.
తెరవెనక ఏం జరిగింది?
ఈఎస్ ఐ కేసులో జయరాం కుమారుడు బెంజి కారును గిఫ్ట్‌గా పొందారంటూ.. అయ్యన్న ఫొటోలతో సహా వెల్లడించారు. అంతేకాదు.. తర్వాత పరిణామంలో మంత్రి జయరామ్ తన భార్య, తమ్ముళ్ల భార్యలతో పోగేసిన భూ దందాలను కూడా ఆధారాల సహితంగా అయ్యన్న వెల్లడించారు. దీంతో వైసీపీ నేతలే విస్తుపోయారు. ఎందుకంటే.. ఎక్కడి అయ్యన్న.. ఎక్కడి జయరాం. ఆయనది విశాఖ.. ఈయనది కర్నూలు. అయినా ఇన్ని ఆధారాలు ఎలా వచ్చాయి ? తెరవెనుక ఏం జరిగింది ? అనేది ఆసక్తిగా మారింది. ఇక, విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి కూడా ప్రభుత్వంలోని మంత్రులు అవినీతి చేస్తున్నారంటూ.. కొన్ని ఆధారాలతో సహా వెల్లడించారు.
లీకులు ఇస్తూ……
నిజానికి అవి చాలా గుట్టుగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.కానీ, ఇలా బహిర్గతం ఎలా అయ్యాయి? పైగా మంత్రులు కొందరు సలహాదారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ.. టీడీపీ ఆధారాతో సహా ఎలా బయటపెడుతోంది ? అంటే.. వైసీపీలోని కొందరు నేతలే లీకులు ఇస్తున్నారని అంటున్నారు తమ్ముళ్లు. దీనికి కారణం.. పార్టీ కోసం తాము ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు వీరు వచ్చి అనుభవిస్తున్నారనే కడుపు మంట కొందరికి ఉంటే.. తమకు కనీసం పైసా కూడా పెట్టకుండా మొత్తం వారే కొట్టేస్తున్నారనే ఆవేదన మరికొందరి లో ఉందని అంటున్నారు.
ఆగేట్లు లేదుగా…..
ఇక కొందరు సీనియర్ నేతలు, నాలుగైదు సార్లు గెలిచిన వారు కూడా మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతో ఉన్నారు. వారు లేదా వారి అనుచరులు కూడా జూనియర్ మంత్రులు ఏం చేసినా వాటిని భూతద్దంలో పెట్టి చూపించేలా ప్రతిపక్షానికి సహకరిస్తున్నారట. ఇక త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో కొందరు వైసీపీ ఆశావాహులు కూడా ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారిని ఏదోలా బద్నాం చేసేందుకు తెరవెనక చాలానే చేస్తున్నారన్న టాక్ ఉంది. మరి ఇది మున్ముందు ముదురుతుందో.. ఇక్కడితో ఆగుతుందో చూడాలి.