ఇజ్జత్ కా సవాల్… జ‌గ‌న్ నిర్ణయంతో బిగ్ షాక్‌

అస‌లే ఎవ‌రికి వారుగా ఉన్న ప్రకాశం జిల్లా టీడీపీ నేత‌ల‌కు ఇప్పుడు పెను క‌ష్టం వ‌చ్చి ప‌డింది. జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న కీల‌క నిర్ణయంతో ఇప్పుడు వారంతా [more]

Update: 2020-03-09 06:30 GMT

అస‌లే ఎవ‌రికి వారుగా ఉన్న ప్రకాశం జిల్లా టీడీపీ నేత‌ల‌కు ఇప్పుడు పెను క‌ష్టం వ‌చ్చి ప‌డింది. జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న కీల‌క నిర్ణయంతో ఇప్పుడు వారంతా ఏకం కావాల్సిన త‌రుణం ఏర్పడింది. అంతేకాదు, అంతా ఒకే మాట‌పైకి వ‌చ్చి.. ఒకే పోరును సాగించాల్సిన స‌మ‌యం కూడా ఆస‌న్నమైంది. అయిన‌ప్పటికీ నాయ‌కులు ఇప్పటి వ‌ర‌కు మౌనం వీడ‌క‌పోవ‌డం చూస్తే ప‌రిస్థితి చేతులు దాటుతున్న ప‌రిణామాలే క‌నిపిస్తున్నాయి. గత ఏడాది ఎన్నిక‌ల్లో ప్రకాశం జిల్లా నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలు టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. అయితే, వీరిలో ఇద్దరు కేసుల భ‌యంతో మౌనం వ‌హించారు.

ఎవరి పని వారు చేసుకుంటూ….

మ‌రో ఇద్దరిలో ఒక‌రు త‌మ సొంత వ్యవ‌హారాలు చేసుకుంటుంటే మ‌రొక‌రు నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమిత‌మ‌య్యారు. అద్దంకి ని యోజ‌క‌వ‌ర్గం నుంచి గొట్టిపాటి ర‌వి, చీరాల నుంచి క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణమూర్తి, కొండ‌పి నుంచి డోలా బాల‌వీరాంజ‌నేయ స్వామి, ప‌రుచూరు నుంచి ఏలూరి సాంబ‌శివ‌రావులు టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. మిగిలిన వారు ఓడిపోయారు. వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అయితే, వీరు ఎక్కడా ఇటీవ‌ల కాలంలో క‌నిపించ‌డం లేదు. ఇక‌, జిల్లా టీడీపీ అధ్యక్షుడు త‌న అడ్రస్ ఎక్కడో కూడా ఎవ‌రికీ చెప్పకుండా అంద‌రికీ దూరంగా ఉన్నారు. దీంతో చంద్రబాబును అనుస‌రించేవారు, ఆయ‌నకు మ‌ద్దతి చ్చేవారు కూడా క‌రువ‌య్యారు. ఇటీవ‌ల ప్రజాచైత‌న్య యాత్రలోనూ ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించింది.

పార్టీ కార్యాలయాన్ని……

అయితే, ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న కీల‌క నిర్ణయంతో పార్టీకి జిల్లాలో తీవ్ర శ‌రాఘాతం త‌గిలే ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికైనా వీరంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి, ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డ‌మో లేదా న్యాయ పోరాటానికి వెళ్లడమో చేయాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లా ఒంగోలులో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయ‌న త‌న సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 1.96 ఎకరాల భూమిని కేటాయించుకున్నారు. జిల్లా పార్టీ కార్యాల‌యాన్ని అధునాత‌న హంగుల‌తో నిర్మిం చాలని నిర్ణయించారు. అయితే, ఇంత‌లోనే ప్రభుత్వం మారిపోయి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. దీంతో ఈ కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల సర్కార్‌ జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయంతో…..

అంతేకాదు, ఆ భూమిని జలవనరుల శాఖకు అప్పగించాలని, ఎన్‌ఎస్‌పీ కాలనీ విస్తరణకు ఆ భూమిని వినియోగించాలని నిర్ణ యించింది. ఈ ప‌రిణామం జిల్లా పార్టీకి తీవ్ర ఇబ్బందిక‌రం. అంతేకాదు, మ‌రో మాట‌లో చెప్పాలంటే.. ఇజ్జత్ కా స‌వాల్‌. పార్టీ అధినేత చంద్రబాబు దీనిపై ఎలా రియాక్ట్ అవుతార‌నేది ఎలా ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో దీనిపై ఉద్యమించాల్సిన అవ‌స‌రం, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవ‌స‌రం అక్కడి నాయ‌కులకు ఉంది. అయితే, ఇప్పటి వ‌ర‌కు ఈ త‌ర‌హా ప్రయ‌త్నం టీడీపీ త‌మ్ముళ్లు చేయ‌డం లేదు. ఏక‌తాటి పైకి వ‌చ్చి పార్టీ ప‌రువును, మ‌ర్యాద‌ను నిల‌బెట్టడంలో వారు ఉత్సాహం చూపించ‌డం లేదు. ఇదే కొన‌సాగితే టీడీపీ ప‌రువు ప్రకాశంలో ఇబ్బందిపాల‌య్యే ఛాన్స్ ఉంటుంది. మీ పార్టీ కార్యాల‌యాన్నే కాపాడుకోలేక పోయారు! అనే విమ‌ర్శల‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని టీడీపీ అభిమానులు, సానుభూతి ప‌రులు అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News