అదానీని అలా అందలం ఎక్కిస్తారా ?

అదానీ. నయా పారిశ్రామిక వేత్త. దేశంలో ఒకపుడు టాటాలూ, బిర్లాలు రాజ్యం చేశారు. ఇపుడు అంతా అంబానీలు. అదానీలదే రాజ్యం. ఎవరు దేశంలో ఏలికలుగా ఉన్నా వారికి [more]

Update: 2021-06-21 12:30 GMT

అదానీ. నయా పారిశ్రామిక వేత్త. దేశంలో ఒకపుడు టాటాలూ, బిర్లాలు రాజ్యం చేశారు. ఇపుడు అంతా అంబానీలు. అదానీలదే రాజ్యం. ఎవరు దేశంలో ఏలికలుగా ఉన్నా వారికి ఒక్కటే. వారి పనులు అలా చకచకా సాగిపోతాయి. రాచమర్యాదలకు సైతం ఎలాటి ఢోకా ఉండదు. ఇదిలా ఉంటే దేశంలో బాహుబలిగా పారిశ్రామిక రంగంలో ఉన్న అదానీని పెద్దల సభలో కూర్చేబెట్టేందుకు తెర వెనక ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయట. ఆయనకు రాజ్యసభ తాంబూలం ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని కూడా అంటున్నారు.

నాడు ఆయన….

అంబానీల సహ‌చరుడు పరిమళ్ నత్వానీ గత ఏడాది ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే ఒకటి ఎగరేసుకుపోయారు. ఆయన కోసం ముఖేష్ అంబానీ స్వయంగా ఏరోప్లేన్ లో జగన్ ఉన్న తాడేపల్లి ప్యాలస్ ఎగిరి వచ్చి మరీ ఆయన్ని ఖుషీ చేశారు. దాంతో పరిమళ్ ఏపీ నుంచి పెద్దల సభలో కుర్చీ సంపాదించేశారు ఇపుడు అదానీ వంతు అంటున్నారు. నాడు పరిమళ్ అయినా నేడు అదానీ అయినా కూడా బీజేపీ అగ్ర నాయకత్వం సలహా సూచనల మేరకే జగన్ వారిని ఏపీ కోటాలో పెద్దల సభకు సెలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు.

లాభమేనా …?

పరిమళ్ నత్వానీ ఏపీ నుంచి వైసీపీ కోటాలో ఎంపీ అయినా పెద్దగా ఒనకూడింది లేదు అన్న మాట ఉంది. ఆయన ఏపీలో పరిశ్రమలు పెడతాను అని చెప్పిన మాటలు కూడా ఏడాది గడచినా వట్టి మాటలుగానే మిగిలాయి. ఇపుడు చూస్తే అదానీని తెచ్చి అందలం ఎక్కించినా ఆయన‌ రూట్ కూడా ఢిల్లీ వయా గుజరాత్ అన్నట్లుగానే ఉంటుంది అంటున్నారు. అయితే పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సీట్లు ఇవ్వడం కొత్తకాదు, పైగా ఏపీ లాంటి చోట్ల నుంచి వారిని పంపించడమూ కొత్త కాదు. వారిని నెగ్గించినపుడు ఏపీ ప్రయోజనాల కోసం అన్న మాటను వాడతారు. నిజానికి వారి వల్ల అయా పార్టీలకు ఏమైనా ప్రయోజనమేమో కానీ ఏపీకి కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. పైగా జగన్ పారిశ్రామివేత్త కావడం వల్ల కూడా ఈ రకమైన చుట్టరికాలకు పెద్ద పీట వేస్తున్నారు అంటున్నారు.

లాబీయింగ్ కే …?

అయితే వీరి వల్ల డైరెక్ట్ గా కేంద్ర పెద్దలతో లాబీయింగ్ చేసుకోవడానికి వీలు ఉంటుందని ఒక మాట ఉంది. జగన్ కి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. వాటిని ఇంకా పెంచుకోవడానికి వీలైనంత మేర అటు నుంచి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఈ ఎంపికలు ఉపయోగపడతాయని చెబుతారు. ఏపీ కోటా నుంచి అదానీని పంపించమని కేంద్ర బీజేపీ పెద్దలు జగన్ వద్ద ప్రస్తావించారు అంటున్నారు. ఈ మధ్య జగన్ ఢిల్లీ టూర్ లో ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు. అదాని ఏపీలో పోర్టులన్నింటికీ కొత్త పెత్తందారు అయ్యారు. మరి ఆయన విశాఖలో ఏమైన ఐటీ రంగంలో పెట్టుబడులు పెడతారేమో చూడాలి.

Tags:    

Similar News