టీడీపీ ప‌ట్టించుకోదు.. వైసీపీ ర‌మ్మన‌దు.. కిం క‌ర్తవ్యం.. ?

విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క నాయ‌కుడు, మైనార్టీ నేత జ‌లీల్ ఖాన్ రాజ‌కీయ భ‌విత్యం అగ‌మ్య గోచ‌రంగా మారిందా ? ఆయ‌న ప‌రిస్థితి ఎటూ అర్ధం కాకుండా ఉందా [more]

Update: 2020-08-29 09:30 GMT

విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క నాయ‌కుడు, మైనార్టీ నేత జ‌లీల్ ఖాన్ రాజ‌కీయ భ‌విత్యం అగ‌మ్య గోచ‌రంగా మారిందా ? ఆయ‌న ప‌రిస్థితి ఎటూ అర్ధం కాకుండా ఉందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ఆయ‌న అభిమానులు. ఒకే ఒక్క త‌ప్పు చేసి.. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన ఆయ‌న‌కు ఏకంగా ఇప్పుడు రాజ‌కీయ భ‌విష్యత్తే క‌నిపించ‌కుండా పోయింద‌ని చెబుతున్నారు. తొలుత కాంగ్రెస్‌లో కార్యక‌ర్తగా ప్రారంభించిన రాజ‌కీయ జీవితం జ‌లీల్‌ ఖాన్ ను మంత్రి పీఠం వ‌ర‌కు తీసుకువెళ్లింది. అయితే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు డీఎస్ త‌న‌కు ప‌ద‌వి ఇవ్వడంలో అడ్డుప‌డుతున్నార‌న్న భావ‌న‌తో ఆయ‌న ర‌గ‌డ‌కు దిగి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

మంత్రి పదవి కోసమని…..

ఈ క్రమంలోనే జ‌గ‌న్ పంచ‌న చేరి జలీల్ ఖాన్ 2014లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపుగుర్రం ఎక్కారు. మంత్రి ప‌ద‌విపై కాంక్షతో చంద్రబాబు గూటికి చేరారు. తీరా మైనార్టీ మంత్రి ప‌ద‌వి రేపో మాపో ద‌క్కుతంద‌ని ప్రచారం జ‌రిగిన సంద‌ర్భంలో ఆయ‌న ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో తాను బీకాంలో ఫిజిక్స్ చ‌దివాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయ‌న ప‌రువును గంగ‌లో క‌లిపేశాయి. ఈ వ్యాఖ్యలే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కకుండా అడ్డుప‌డ‌డం నిజంగా యాదృచ్చికం. ఇక‌, అనారోగ్య స‌మ‌స్యల‌తో గ‌తేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున త‌న కుమార్తె ష‌బానా ఖాతూన్‌ను రంగంలోకి దింపారు.

సైలెంట్ గా ఇంటికే పరిమితమయి…..

ఆమెపై మైనార్టీ వ‌ర్గాల్లోనే తీవ్ర వ్యతిరేక‌త వ‌చ్చింది. మైనార్టీ మ‌హిళ పోటీ చేయ‌డం ఏంట‌ని.. మైనార్టీ వ‌ర్గాలు అభ్యంతరం చెప్పాయి. అయిన‌ప్పటికీ మొండిగా ముందుకెళ్లిన జ‌లీల్‌ ఖాన్ కు ఎదురు దెబ్బత‌గిలింది. ఇక, అప్పటి నుంచి ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు అమెరికా నుంచి వ‌చ్చిన ష‌బానా ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వెంట‌నే తిరిగి అమెరికా చెక్కేశారు. ఇక జ‌లీల్‌ ఖాన్ టీడీపీలోనే ఉన్నప్పటికీ ఆయ‌న‌ను ఎవ‌రైనా ప‌ట్టించుకుంటున్నారా ? అంటే లేద‌నే చెప్పాలి. ఆయ‌న ఇప్పుడు మూడు వ‌ర్గాలుగా మారిన బెజ‌వాడ‌ టీడీపీలో ఆయ‌న‌ ఏ వ‌ర్గానికీ ప‌నికిరాకుండా పోయారు. దీంతో సైలెంట్ అయ్యి ఇంట్లోనే కూర్చున్నారు.

రెంటికి చెడ్డ రేవడిలా….

ఇక జ‌లీల్ మ‌ళ్లీ పార్టీ మార‌తాను, జ‌గ‌న్‌కే జై కొడ‌తాను, త‌ప్పులు క్షమించ‌మ‌ని అడుగుతున్నా.. వైఎస్సార్ సీపీ నుంచి తీపి క‌బురు కాదుక‌దా.. ఉలుకు ప‌లుకు లేకుండా పోయాయి. దీంతో జ‌లీల్ ఖాన్ భ‌విత‌వ్యంపై మేఘాలు క‌మ్ముకున్నాయ‌ని అంటున్నారు. మ‌రోప‌క్క, ఆయ‌న వైఎస్సార్ సీపీలోకి వెళ్లేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌న్న వార్తలు రావ‌డంతో చంద్రబాబు కూడా ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో జ‌లీల్ ఖాన్ ప‌రిస్థితి రెండిటికి చెడ్డ రేవ‌డిలా మారిందంటున్నారు ఆయ‌న అభిమానులు.

Tags:    

Similar News