నెలలు కాకుండానే నెట్టేశారా?
కొండ నాలికకు మందేస్తే.. ఉన్న నాలిక ఊడినట్టుగా ఉందని వైసీపీ నాయకులు లోలోన రగిలిపోతున్నా రు. విషయం ఏంటంటే? వైసీపీలో ప్రతి ఒక్కరికీ అధినేత జగన్ అంటే [more]
కొండ నాలికకు మందేస్తే.. ఉన్న నాలిక ఊడినట్టుగా ఉందని వైసీపీ నాయకులు లోలోన రగిలిపోతున్నా రు. విషయం ఏంటంటే? వైసీపీలో ప్రతి ఒక్కరికీ అధినేత జగన్ అంటే [more]
కొండ నాలికకు మందేస్తే.. ఉన్న నాలిక ఊడినట్టుగా ఉందని వైసీపీ నాయకులు లోలోన రగిలిపోతున్నా రు. విషయం ఏంటంటే? వైసీపీలో ప్రతి ఒక్కరికీ అధినేత జగన్ అంటే ఎంతో ఇష్టం. గౌరవం, ప్రేమ కూడా. ఆయనను సీఎంను చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తపించారు. ఈ క్రమంలో ఒక్కో నేత ఒక్కో విధమైన త్యాగం చేశారు. కొందరు 9 ఏళ్ల పాటు పార్టీనే అంటి పెట్టుకుని ఉన్నారు. కొందరు తమ తమ ఆస్తులు కూడా అమ్ము కుని పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నారు. అయితే, ఇలాంటి వారు కూడా పదవులు కోరుకున్నారు. ఇలాంటి వారిని గుర్తించిన జగన్ తాను అధికారంలోకి వస్తే, తప్పకుండా పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన అనడమే కాకుండా ఇస్తున్నారు కూడా.
సీనియర్ నేతగా….
ఇలాంటి వారిలో గుంటూరు జిల్లా గురజాలకు చెందిన బీసీ నాయకుడు, వైసీపీకి అత్యంత కీలక నేత జంగా కృష్ణమూర్తి. వైసీపీ తరపున ఆయన అనేక ఇబ్బందులు చవిచూశారు. వైఎస్ మరణాంతరం నుంచి జగన్ వెంట నడిచిన జంగా కృష్ణమూర్తి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. అయినా కూడా పార్టీని డెవలప్ చేయడానికే ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే గురజాల నియోజకవర్గంలో ఆయన శ్రమించి పార్టీని అభివృద్ది బాటలో నడిపించారు. బలమైన టీడీపీ నాయకుడు, రెండు సార్లు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును ఓడించారు. పల్నాడులో టీడీపీకి కొరకరాని కొయ్యగా కూడా మారారు.
జగన్ తీసుకున్న నిర్ణయంతో…..
ఈ క్రమంలోనే జంగా కృష్ణమూర్తి 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, అప్పట్లో పార్టీ అధినేత జగన్ వ్యూహం మేరకు టికెట్‌ను కాసు మహేష్‌రెడ్డికి త్యాగం చేశారు. అంతేకాదు, కాసు గెలిచేందుకు కాలికి బలపం కట్టుకుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరిగాడు. దీంతో కాసు విజయం సాధించారు. ఇక, ఎన్నికలకు ముంద జగన్ “జంగన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి నా పక్కన కూర్చోబె ట్టుకుంటాను“ అని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం జగన్ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఈ పదవి లభించి ఏడు మాసాలు కూడా పూర్తి కాకముందే, మండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం జంగా కృష్ణమూర్తిలో అసహనాన్ని రెట్టింపు చేస్తోంది.
మండలి రద్దయితే….?
ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేసేందుకు ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీని నడిపించానని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని, ఇప్పుడు ఉన్న ఒక్క ఎమ్మెల్సీ కూడా పోతే తన పరిస్థితి ఏంటని జంగా కృష్ణమూర్తి తన అనుచరుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఉన్న పదవిపోతే తన రాజకీయ గడ్డ అయిన గురజాలలో కాసు ముందు ఆయన తట్టుకుని నిలబడే పరిస్థితి లేదు. అక్కడ కాసు పాతుకుపోయి ఉండడంతో జంగా కృష్ణమూర్తి ఫ్యూచర్ డైలమాలో పడింది. మరి జంగాకు జగన్ ఎలాంటి పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తారో ? చూడాలి.