జేసీ పవన్ కు అదే ప్లస్ అట.. ఇవే కారణాలు?

జేసీ సోద‌రుల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు ఉండ‌రు. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రితో ప్రారంభ‌మైన జేసీ సోద‌రుల ప్రస్థానం రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు [more]

Update: 2021-03-31 02:00 GMT

జేసీ సోద‌రుల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు ఉండ‌రు. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రితో ప్రారంభ‌మైన జేసీ సోద‌రుల ప్రస్థానం రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు విస్తరించింది. తాడిపత్రి కేంద్రంగా మూడు ద‌శాబ్దాలుగా ఈ సోద‌రులు రాజ‌కీయం చేస్తున్నా వీరిపై ఫ్యాక్షన్ ముద్ర బాగా ఉంది. జేసీ దివాక‌ర్ రెడ్డి అంటేనే ఫ్యాక్షన్ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రస్‌. సుధీర్ఘకాలం కాంగ్రెస్‌లో రాజ‌కీయం చేసిన ఈ ఫ్యామిలీ 2014 ఎన్నిక‌ల వేళ టీడీపీలోకి జంప్ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో ప్రభాక‌ర్ తాడిప‌త్రి ఎమ్మెల్యేగా.. దివాక‌ర్ అనంత‌పురం ఎంపీగా విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సోద‌రులు ఇద్దరూ రాజ‌కీయ స‌న్యాసం చేసి త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజ‌నంలో ఇద్దరూ కొట్టుకుపోయారు.

ఓటమి తర్వాత…..

ఎన్నిక‌ల్లో ఓడిపోయాక తాడిపత్రిలో అశ్మిత్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఇటు దివాక‌ర్ వారసుడు ప‌వ‌న్ కుమార్ సైతం రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉంటారా ? అస‌లు వీళ్లు తండ్రుల వార‌సత్వాన్ని కంటిన్యూ చేస్తూ రాజ‌కీయంగా నిల‌దొక్కుతారా ? అన్న సందేహాలు చాలానే ఉన్నాయి. అయితే ప‌వ‌న్ కుమార్ మాత్రం ఈ సందేహాలు ప‌టా పంచ‌లు చేస్తూ అనంత‌లో త‌న‌కంటూ ఓ స్టైల్ రాజ‌కీయం క్రియేట్ చేసుకుంటున్నారు. ఓడిపోయిన వెంట‌నే ఆయ‌న జ‌నాల్లోకి తాను ఉంటాన‌ని ప్రచారం చేయ‌డం విశేషం. ఆ త‌ర్వాత త‌మ కుటుంబాన్ని అధికార పార్టీ ఎంత టార్గెట్ చేసినా ప‌వ‌న్ కుమార్ ముందుకు వ‌చ్చి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.

అందరితో టచ్ లో ఉంటూ…..

అటు చంద్రబాబుతోనే కాకుండా.. ఇటు యువ‌నేత లోకేష్‌తో ట‌చ్‌లో ఉంటూ అనంత‌లో ప‌ట్టు పెంచుకుంటున్నారు. లోకేష్ సైతం జేసీ ఫ్యామిలీని ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం కూడా ప‌వ‌నే. గ‌త ఎన్నిక‌ల్లో కంచుకోట అయిన తాడిప‌త్రిలో కూడా టీడీపీ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బీసీల‌తో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న క‌మ్మల‌ను కూడా వారు దూరం చేసుకున్నారు. టీడీపీకి సాలిడ్ ఓటు బ్యాంకుగా ఉన్న క‌మ్మ వ‌ర్గానిని చెందిన స్వామిజీతో జేసీ ఫ్యామిలీ గొడ‌వ ప‌డ‌డంతో ఆ వ‌ర్గం వాళ్లు కూడా గ‌త ఎన్నిక‌ల్లో వీళ్లకు వ్యతిరేకంగా వైసీపీకే ఓట్లు వేశారు.

అన్ని వర్గాలను కలుపుకుని వెళుతూ…..

అయితే ప‌వ‌న్ కుమార్ మాత్రం ఈ డ్యామేజీల‌ను కంట్రోల్ చేసుకుంటూ రాజ‌కీయం చేస్తున్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తాడిపత్రిలో క‌మ్మల‌ను క‌లుపుకోవ‌డంతో పాటు ఇటు క‌ళ్యాణదుర్గంలో ఇన్‌చార్జ్ ఉమామ‌హేశ్వర నాయుడుకు అన్నింటా బాస‌ట‌గా ఉంటున్నారు. అనంత అర్బన్‌లో ఇన్‌ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే ప్రభాక‌ర్ చౌద‌రితో గ్యాప్ వ‌చ్చినా త‌నంత‌ట తానే ఓ అడుగు వెన‌క్కు వేసి స‌ర్దుబాటు ధోర‌ణితో ఉన్నారు. ఇక అటు శింగ‌న‌మ‌ల వ్యవ‌హారాలు మొత్తం చూసుకుంటున్నారు. ఏదేమైనా తండ్రిలా దూకుడు …ఫ్యాక్షన్ రాజ‌కీయాల‌కు దూరంగా వెళుతోన్న ప‌వ‌న్ కుమార్ రాజకీయం ఆయ‌న‌కు ప్లస్ అయ్యే ఛాన్సులే ఉన్నాయి.

Tags:    

Similar News