జేసీకి తాత్కాలిక ఆనందమేనా?

జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏమాత్రం సంకోచించలేదు. కౌన్సిలర్ [more]

Update: 2021-03-31 00:30 GMT

జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏమాత్రం సంకోచించలేదు. కౌన్సిలర్ గా గెలిచి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. రాష్ట్రమంతటా టీడీపీ ఓటమి పాలయినా తాడిపత్రిలో మాత్రం పసుపు జెండా ఎగరగలిగిందంటే అది జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉన్న పట్టు అని చెప్పక తప్పదు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యే ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి టెన్షన్ కు గురయ్యారు.

ఇద్దరు సభ్యుల మద్దతుతోనే….

ఇద్దరు సభ్యుల మద్దతుతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డుల్లో 18 వార్డులలో 18 టీడీపీ గెలుచుకుందంటే ఆయన అన్ని రకాలుగా క్యాడర్ ను తాడిపత్రిలో మొహరించడమే కారణం. ఇక్కడ వైసీపీ కూడా 16 డివిజన్లు గెలుచుకుని బలమైన పోటీ ఇచ్చింది. ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులున్నా వైసీపీ తాడిపత్రిని దక్కించుకోలేక తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కు వేసిందంటున్నారు.

క్యాంప్ నకు తరలించడంతో…

జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వతంత్ర అభ్యర్ధి, సీపీఐ అభ్యర్థి మద్దతు పలకడంతో ఆయన గెలుపు సాధ్యమయింది. కేవలం ఇద్దరు సభ్యుల మద్దతుతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఐదేళ్ల పదవీకాలం. అయితే వైసీపీ రాష్ట్రంలో మూడేళ్లు అధికారంలో ఉండనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి తన మద్దతుదారులను క్యాంప్ నకు తరలించారు. అందుకే వైసీపీ డీల్ వర్క్ అవుట్ కాలేదంటున్నారు.

ఎప్పటికైనా తప్పదట…..

ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ అయినా ఆరు నెలల తర్వాత అవిశ్వాసం పెట్టే అవకాశముందని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు నలుగురు సభ్యులు రెడీగా ఉన్నారని పెద్దిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అధినాయకత్వం ఆదేశాల మేరకే తాము తాడిపత్రి మున్సిపాలిటీని జేసీ ప్రభాకర్ రెడ్డి వదిలేశామంటున్నారు. మొత్తం మీద తాడిపత్రి టెన్షన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరంతరం వెంటాడేలానే ఉంది. అందుకే ఆయన జగన్ ను కలుస్తానని చెప్పాడంటున్నారు.

Tags:    

Similar News