సింధియాకు ఎప్పుడు పదవి?

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరిపోయారు. తనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను తీసుకురావడంతో మధ్యప్రదేశ్ లోని కమల్ నాధ్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. [more]

Update: 2020-06-21 18:29 GMT

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరిపోయారు. తనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను తీసుకురావడంతో మధ్యప్రదేశ్ లోని కమల్ నాధ్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. దీంతో మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. త్వరలో మధ్యప్రదేశ్ లో దాదాపు 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని బీజేపీ మాట ఇచ్చింది.

రాజ్యసభకు జ్యోతిరాదిత్య…..

అనుకున్నట్లుగానే మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు ఎంపిక చేసింది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. పార్టీపై నమ్మకం లేని ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. మరో వైపు నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉన్న బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ నేతలు సయితం బీజేపీ వైపు చూస్తుండటం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపర్చే అంశమే.

కరోనా ఒకవైపు….

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా మోదీ తన మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరో వైపు చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

త్వరలోనే విస్తరణ….

జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి గ్యారంటీ అయినప్పటికీ అనేక కారణాల దృష్ట్యా వాయిదా పడుతూ వస్తుంది. ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. కేబినెట్ ర్యాంకు ఉన్న పదవిని జ్యోతిరాదిత్య సింధియా ఆశిస్తున్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో జ్యోతిరాదిత్య సింధియా చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సింధియాకు మంత్రి పదవి గ్యారంటీ. అయితే ఎప్పుడన్నదే ఇంకా తేలడం లేదు.

Tags:    

Similar News