కేసీఆర్ ని జగన్ గెలవాలట.. తమ్ముళ్ల ఆరాటం

ఎక్కడ కేసీఆర్. ఎక్కడ జగన్. ఇద్దరికీ వయసులో తండ్రీ కొడుకుల సామ్యం ఉంది. రాజకీయాల్లో చూసుకుంటే గురు శిష్యుల అంతరం ఉంది. అటువంటి కేసీఆర్ ని కేవలం [more]

Update: 2020-04-19 00:30 GMT

ఎక్కడ కేసీఆర్. ఎక్కడ జగన్. ఇద్దరికీ వయసులో తండ్రీ కొడుకుల సామ్యం ఉంది. రాజకీయాల్లో చూసుకుంటే గురు శిష్యుల అంతరం ఉంది. అటువంటి కేసీఆర్ ని కేవలం పది నెలల పాలనానుభవంతో జగన్ గెలవగలరా? కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఉద్యమకారుడు, సాధారణంగా ఉద్యమకారుల తీరు వేరు, వారు అక్కడ సక్సెస్ అయినా రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు. ఇక రాజకీయ నాయకుడు అందరికీ కలుపుకుని ఐక్యంగా ఉద్యమం చేయ‌లేడు. ఎన్నో మైనస్ లు కాలికి తగులుతూంటాయి. అయితే రాజకీయంగా గండర గండడు అయిన కేసీఆర్ ఈ రేర్ ఫీట్ ని సక్సెస్ చేసి చూపించారు. ఇక కేసీఆర్ ను జయించడం చంద్రబాబు వల్లనే కాలేదు, జగన్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు కదా. మరి ఇది ఎలా సాధ్యం.

అదటా కోరిక….

అయితే ఇది ఉల్టాలో గెలుపుట. అంటే కేసీఆర్ తో పాజిటివ్ వేలో ఓడించడం కాదు, నెగిటివ్ వేలోనట. ఇదంతా తమ్ముళ్ళ కోరికట. అంతకు మించి అధినాయకుడు చంద్రబాబు ఆరాటమట. ఏపీలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని ప్రతీ రోజూ మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు బాధపడుతున్నారని వైసీపీ నేతలు ఒక్క లెక్కన సెటైర్లు వేస్తున్న్నారు. మరో వైపు చూస్తే తెలంగాణాలో వరసగా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. వాటితో పొలిస్తే గత పాతిక రోజులుగా ఏపీలో కేసులు తక్కువగానే ఉంటున్నాయి. ఏపీలో కేసులు పెరిగినా కూడా తెలంగాణతో పోలిస్తే నంబర్ చిన్నదిగా ఉంటోంది.

కేసీఆర్ ను మించాలా?

నిజంగా ఇవన్నీ మామూలుగా ఎవరూ కోరుకోరు, కానీ రాజకీయాలకు ఏ లాజిక్కూ, మరే మానవత్వం ఉండదని అంటారు. అందుకే సహజంగా వారు ఎపుడూ ఏదో ఓ సమస్య కోరుకుంటారు. అపుడే వారికి మీడియాలో ఛాన్స్ దొరుకుతుంది. ఫోకస్ అయ్యేందుకు వీలు అవుతుంది. మరి దుష్టమైన‌ కోరిక అయినా తమ్ముళ్ల పెడబొబ్బలు చూస్తూంటే ఏపీలో ఒక్కసారిగా కరోనా కేసులు వెల్లువలా పెరిగిపోవాలని ఉందేమోనని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. కేసీఆర్ తో పోటీ పడి ఆయన్ని ఓడించి ఏపీ ముందు వరసలోకి వస్తే బాబోయ్ కరోనాలో ఏపీ సర్కార్ విఫలం అయిందని పచ్చ పార్టీ వీరంగం వేస్తుందేమో. అదే తెలంగాణాలో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నా నోరు మెదపని తమ్ముళ్ళకు ఏపీ మాత్రం ఆడిపోసుకోవడానికి కావాల్సివచ్చింది. అందుకే అక్కడ కేసులు ఎక్కువ ఉన్నా కేసీఆర్ బాగా చేశాడనే అంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి లాంటి వారు.

విశాఖ గోల….

ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ ఉంది. ఇక్కడ మొదట్లో కరోనా కేసులు వరసగా పెరిగాయి. ఈ మధ్యనే కేసులు తగ్గి నంబర్ నిలకడగా ఉంది. అయినా సరే తమ్ముళ్ళు విశాఖలో ఎక్కువ కేసులు ఉన్నాయని దబాయిస్తున్నారు. కరోనా కేసుల గురించి చెప్పకుండా ప్రభుత్వం దాచేస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. నిజంగా దీనికి లాజిక్ ఉందా అని వైద్య నిపుణులే ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఉన్నది కరోనా దాచేస్తే దాగడానికి బెదిరిస్తే పోవడానికి అది మామూలు జబ్బు కాదు, ప్రాణాంతకి అని వైద్యులు అంటున్నారు. ఇవన్నీ సిల్లీ కామెంట్స్ అని కొట్టిపారేస్తున్నారు. మరో వైపు తమ్ముళ్ళు ఇలా కరోనా కేసులు ఏపీలో ఎక్కువ, విశాఖలో ఎక్కువ అంటూంటే జనాలు భయపడిపోయి పానిక్ అవుతున్నారు. ఎంత రాజకీయం చేయాలనుకున్నా ఇలాంటి విపత్తు వేళ తగదని మేధావులు కూడా హెచ్చరిస్తున్నారు. మందలిస్తున్నారు కూడా. అయినా తమ్ముళ్ళు వింటారా?

Tags:    

Similar News