వారి బంధం ఫెవికాల్…లౌక్యంగా తెరదించేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల బంధం ఫెవికాల్ కన్నా గట్టిదేనా …? రెండు రాష్ట్రాల నడుమ జల జగడం మొదలు అయినా [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల బంధం ఫెవికాల్ కన్నా గట్టిదేనా …? రెండు రాష్ట్రాల నడుమ జల జగడం మొదలు అయినా [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల బంధం ఫెవికాల్ కన్నా గట్టిదేనా …? రెండు రాష్ట్రాల నడుమ జల జగడం మొదలు అయినా దీన్ని లైట్ తీసుకోవాలనే రీతిలో తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలు తేల్చడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మా ఇద్దరి నడుమ సఖ్యత బాగుంది, ఇకపై కూడా బాగుంటుంది అంటూ గులాబీ బాస్ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నే అయ్యింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఏపీ నీటిని అక్రమంగా తరలిస్తుందంటూ మొదలైన యుద్ధానికి ప్రస్తుతానికి కేసీఆర్ లౌక్యంగా తెరదించారు. ఈ సమస్యను కాంగ్రెస్, బిజెపి లు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలకు పూర్తిగా చెక్ పెట్టేందుకే ఆయన వ్యూహం ఉన్నట్లు కేసీఆర్ తీరు చెప్పక చెప్పింది.
టిడిపి డిఫెన్స్ లో పడినా …
ఏపీ తెలంగాణ సిఎం ల నడుమ యుద్ధం అంతా డ్రామాగానే టిడిపి మొదటి నుంచి అనుమానించింది. ఇది కావాలనే రెండు రాష్ట్రాలు లేవనెత్తయన్నది పసుపు దళపతి అనుమానం. దాంతో ఈ వ్యవహారంపై నోరు పెద్దగా మెదపకుండా జాగ్రత్త పడింది టిడిపి. అయితే వైసిపి మాత్రం పదేపదే టిడిపి వైఖరి చెప్పాలంటూ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నం చేసింది. వివాదాస్పద అంశంలో తమ వైఖరి చెబితే తెలంగాణాలో మిణుకు మిణుకుమంటూ ఉన్న తమ పార్టీ దీపం మొత్తం ఆరిపోతుందన్న టిడిపి ఆందోళన ఉన్న నేపథ్యంలో ఆచితూచి దీనిపై అడుగులు వేసింది.
వేడి చల్లార్చినట్లేనా?
అయితే ఏపీ బిజెపి శాఖ ఇక్కడ, తెలంగాణ వాదనకు అనుకూలంగా టి బిజెపి లైన్ తీసుకున్నాయి. కాంగ్రెస్ అదే దారిలో పోయింది. అయితే ఈ కీలక అంశంలో తెగేదాకా లాగి రెండు తెలుగు రాష్ట్రాల నడుమ చిగురించిన స్నేహ వాతావరణం చెదిరి పోకుండా కేసీఆర్ జాగ్రత్త పడటంతో ఇప్పుడు వేడి చల్లారింది. కానీ రాబోయే రోజుల్లో మరోసారి ఈ అంశం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జల జగడాన్ని అవసరమైన సమయంలో తెరమీదకు తేనున్నాయి. అప్పుడైనా టిడిపి ఏదో ఒక స్టాండ్ తీసుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దానికి చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి.