కేసీఆర్ పై టార్గెట్ ను రీచ్ అవుతారా?

కేసీఆర్ జుట్టు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకునేందుకు తహతహలాడుతోంది తెలంగాణ బిజెపి. బండి సంజయ్ ని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించాక బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా [more]

Update: 2020-07-06 09:30 GMT

కేసీఆర్ జుట్టు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకునేందుకు తహతహలాడుతోంది తెలంగాణ బిజెపి. బండి సంజయ్ ని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించాక బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా నుంచి అంతా గులాబీ దళంపై దాడిని తీవ్రం చేశారు. తెలంగాణ లో పాగా వేసేందుకు అవసరమైన అన్ని శక్తులను ప్రయోగించాలని కేసీఆర్ దెబ్బకు ఇప్పటికే కాంగ్రెస్ అక్కడ కుదేలు అయిన పరిస్థితిలో ఆ స్థానం అందిపుచ్చుకోవాలని కమలనాధులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. దాంతో టి పాలిటిక్స్ రోజు రోజుకు హాట్ హాట్ గా మారిపోతున్నాయి.

కరోనా దొరికింది ….

టి సర్కార్ వైరస్ టెస్ట్ లను నామమాత్రంగా చేపట్టడాన్ని హై కోర్టు నుంచి అంతా ఇప్పటికే తప్పు పట్టారు. టెస్ట్ ల సంఖ్య తక్కువగా ఉన్నా కేసుల సంఖ్య తెలంగాణ లో ముఖ్యంగా హైదరాబాద్ లో విజృంభిస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఈ పాయింట్ పై ఫోకస్ పెట్టింది బిజెపి. అధిష్టానం నుంచి రామ్ మాధవ్ నేతృత్వంలో పదేపదే విమర్శలు ఎక్కుపెట్టింది. రోజుకు 11 వేలమందికి పరీక్షలు చేయాలిసి ఉండగా 3 వేలమందికి మాత్రమే చేస్తూ తప్పుడు లెక్కలు కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం సమర్పిస్తుందని మాధవ్ ఆరోపించారు. కరోనా లో తెలంగాణ చెబుతున్నవి అన్ని తప్పుడు లెక్కలు ఇచ్చే సమాచారం తప్పే అంటూ ఆయన తీవ్రంగా ఆరోపించారు. అందుకే హైదరాబాద్ అభద్రతకు కేరాఫ్ గా మారిందని విమర్శించారు ఆయన.

రాజా సింగ్ నుంచి అంతా …

ఇంతకు ముందు బిజెపి ఎమ్యెల్యే రాజా సింగ్ ఘాటు విమర్శలే చేశారు. రాజు పేద తేడా లేకుండా అంతా ప్రభుత్వ ఆసుపత్రిలోనే జబ్బు వస్తే చికిత్స అన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రయివేట్ లో మంత్రులకు ఎమ్యెల్యేలకు బడా బాబులకు చికిత్స ఎందుకు చేయిస్తుందని నిలదీశారు ఆయన. ప్రభుత్వ ఆసుపత్రులపై వారికెందుకు నమ్మకం లేదన్నది ఆయన ప్రశ్న. ఇదిలా ఉంటె బిజెపి టి అధ్యక్షుడు సంజయ్ సైతం రోజుకో ఆందోళనతో హైదరాబాద్ లో హల్ చల్ చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల నుంచి అనేక అంశాలపై ఆయన ఒక పక్క ఉద్యమాలు చేస్తూనే మరోపక్క సర్కార్ ను కడిగేస్తున్నారు.

గులాబీ ధీటుగానే బదులిస్తున్నా …

దీనికి గులాబీ దళం ధీటుగానే సమాధానాలు చెబుతుంది. కమలం హంగామా అలావుంటే కాంగ్రెస్ హడావిడి అంతంత మాత్రంగానే ఉంది. అదే ఇప్పుడు బిజెపి సైన్యానికి వరంగా మారింది. దాంతో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనే రీతిలో గట్టి పోరాటానికి నడుం బిగించింది కమలం. వీరి పోరాటాలకు అధిష్టానం నుంచి ఆశీస్సులు మెండుగా లభిస్తూ ఉండటంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరం కానున్నాయి.

Tags:    

Similar News