భయం లేదు… భక్తి లేదు…!!

గత ఐదేళ్ల కేసీఆర్ పరిపాలనకు… ఇప్పటి దాదాపు ఏడాది పరిపాలనకు ఎంతో తేడా ఉంది. గత పరిపాలన హయాంలో ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా కేసీఆర్ ఎంత చెబితే [more]

Update: 2019-09-14 03:30 GMT

గత ఐదేళ్ల కేసీఆర్ పరిపాలనకు… ఇప్పటి దాదాపు ఏడాది పరిపాలనకు ఎంతో తేడా ఉంది. గత పరిపాలన హయాంలో ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా కేసీఆర్ ఎంత చెబితే అంత. ఆయన గీచిన గీత దాటని పరిస్థితి. నేతలు పార్టీకి వీర విధేయులుగా ఉండేవారు. రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలిచిన కేసీఆర్ అంటే ఈసారి అంతకంటే రెట్టింపు భయం, భక్తి నేతల్లో ఉండాలి. కానీ ివిచిత్రంగా ఈసారి నేతల్లో అది కొరవడింది. కేసీఆర్ అంటే భయం పూర్తిగా పోయింది.

నెల రోజుల నుంచి….

గత నెల రోజులుగా గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో కిందిస్థాయి కార్యకర్త కూడా ఊహించలేదు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయలేదు. అలాగే విపక్షాలను దాదాపు చేతులాడకుండా చేసేశారు. అయితే ఒక్క బీజేపీ మాత్రమే కేసీఆర్ మింగుడు పడని విధంగా తయారైంది. ఈ నేపథ్యంలో రెండోసారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన కేసీఆర్ కు సొంత పార్టీ నేతల నుంచే థిక్కార స్వరం విన్పిస్తోంది.

ఈటెల తో మొదలు….

ముందుగా మంత్రి ఈటెల రాజేందర్ మొదలుపెట్టిన ఈ తంతు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. తామే గులాబీ పార్టీ జెండా ఓనర్లమని రాజేందర్ ఈటెల్లాంటి మాటలను వదిలేశారు. ఆయనను పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారమూ విస్తరణకు ముందు జరిగింది. అయితే ఆయన సేఫ్ గానే ఉన్నారు. ఈటెల తర్వాత రసమయి బాలకిషన్ కూడా ధిక్కార స్వరాన్ని విన్పించారు. ఇక మంత్రి వర్గ విస్తరణ తర్వాత మాజీ మంత్రులు నాయిని నరసింహారెడ్డి, రాజయ్యలు అసంతృప్తి వ్యక్తం చేసి ఆ తర్వాత కేటీఆర్ సూచనతో కొంత స్వరం మార్చుకున్నారు.

థిక్కార స్వరం…..

తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ఎమ్మెల్యే షకీల్ వ్యవహారమూ పార్టీకి తలనొప్పిగా మారింది. షకీల్ బీజేపీ ఎంపీ అరవింద్ ను కలవడం పార్టీకి చికాకును తెప్పించింది. షకీల్ తర్వాత తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంత అసంతృప్తి గూడుకట్టుకుని ఉందనేది ఈ నెలరోజుల్లోనే స్పష్టంగా బయటపడుతుంది. దీన్ని బట్టే చూస్తే కేసీఆర్ అంటే పార్టీలో భయం లేదు… భక్తి లేదు అన్నది బహిర్గతమయింది. నేతలందరూ తమ గాడ్ ఫాదర్ కేసీఆర్ అంటూనే కుక్కిన పేనుల్లో పడేది లేదన్న సంకేతాలు పంపుతున్నారు.

Tags:    

Similar News