దాన్ని బట్టే అది ఉంటుందట

అధికార పార్టీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు టార్గెట్ పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించకుంటే వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక పదవులు దక్కే [more]

Update: 2020-01-05 09:30 GMT

అధికార పార్టీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు టార్గెట్ పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించకుంటే వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక పదవులు దక్కే అవకాశం లేదు. ఎమ్మెల్యేలకు ముఖ్యంగా ఈ లక్ష్యం చేరుకోకుంటే మున్ముందు కష్టకాలమే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. కేసీఆర్ ఇప్పటికే విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. దిశానిర్దేశం చేశారు.

కేటీఆర్ స్వయంగా….

మున్సిపల్ ఎన్నికలు మొత్తాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా చూస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ కేటీఆర్ చూసుకుంటారు. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా అది కేటీఆర్ పై పడుతుందన్న ఆందోళన కేసీఆర్ లో ఉంది. అందుకే పార్టీనేతలకు, ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

పనితీరు ఆధారంగానే….

మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ నేతలకు పరీక్షగా మారాయని చెప్పొచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు, నేతల పనితీరు ఆధారంగానే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారంటున్నారు. ఫలితాలే పదవులకు ప్రామాణికంగా ఉంటాయని కేసీఆర్ ఇప్పటికే నేతలకు సంకేతాలు పంపారు. ఎవరూ తమ నియోజకవర్గాలు వదలి రావద్దని కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో 120 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లలో ఈ ఎన్నికలు జరగనుండటంతో దాదాపు తెలంగాణ అంతటా ఎన్నికల సందడి నెలకొందనే చెప్పాలి.

నివేదికలు… సర్వేలతో…..

ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కేసీఆర్ ఇన్ ఛార్జులను నియమించారు. వారితో ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నారు. మరోవైపు మున్సిపాలిటీల వారీగా కూడా కేసీఆర్ సర్వే చేయిస్తున్నారు. సర్వే నివేదికల ఆధారంగా ప్రగతి భవన్ నుంచే నేతలకు కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రతిభ కనపర్చిన నేతలకే భవిష్యత్తులో పదవులు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేయడంతో టెన్షన్ గా గులాబీ పార్టీ నేతలు ఎన్నికల గోదాలోకి దూకారు.

Tags:    

Similar News