Kcr : ఎందుకిలా మారిపోయారు?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన పూర్తిగా యాక్టివ్ అయ్యారు. గతంలో మాదిరి ప్రగతి భవన్ [more]

Update: 2021-09-30 11:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన పూర్తిగా యాక్టివ్ అయ్యారు. గతంలో మాదిరి ప్రగతి భవన్ కే పరిమితమవ్వలేదు. ఇటు జిల్లా పర్యటనలతో పాటు అటు హస్తిన టూర్లు కూడా జోరుగా చేస్తున్నారు. పార్టీలో వారే ముక్కున వేలేసుకునే విధంగా కేసీఆర్ లో ఇంత మార్పు వచ్చిందా? అన్న చర్చ నడుస్తుంది.

రెండు నెలల నుంచి….

గత రెండు నెలల నుంచి కేసీఆర్ వైఖరి మార్చుకున్నారు. కేవలం ప్రగతి భవన్, ఫాంహౌస్ కు మాత్రమే పరిమితమవుతారన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఆయన జిల్లాల బాట పట్టారు. జనంతో మమేకమవుతూ వారి సమస్యలను వినేందుకు ముందుకు వస్తున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత పార్టీ నేతలకు కూడా ప్రగతి భవన్ లో తలుపులు తెరిచి ఉంచారంటున్నారు. నేరుగా కేసీఆర్ ను కలిసేందుకు గతంలో మాదిరి ఇబ్బందులు పడాల్సిన పనిలేదని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

ఢిల్లీ పర్యటనలు కూడా….

మరోవైపు కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు కూడా జోరుగా చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఈ పర్యటనలు చేస్తున్నారంటున్నారు. సెప్టంబరు నెలలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు వెళ్లిన కేసీఆర్ అక్కడే వారం రోజులు మకాం వేశారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. మరోసారి ఇదే నెలలో ఢిల్లీ వెళ్లారు. తనకు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అని కేసీఆర్ భావిస్తున్నారు.

బీజేపీ పై నెపం….

అందుకే తాను ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా బీజేపీ నేతల మనసులు కరగలేదని, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు రాలేదని చెప్పడానికే ఢిల్లీ టూర్లు కేసీఆర్ ఎక్కువగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఇక జిల్లాల పర్యటనలు కూడా పెంచనున్నారు. ప్రతి జిల్లాను టచ్ చేసి ఇటు పార్టీ క్యాడర్ తో పాటు, ప్రజలను కూడా తన వైపు మలచుకోవాలని, రెండుసార్లు వరసగా గెలవడంతో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టాలన్నది కేసీఆర్ ప్రయత్నంగా ఉంది.

Tags:    

Similar News