ఆయనకు ఫుల్లు క్లారిటీ ఉందట…మరి వీరికో?
రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో తెలంగాణ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. టీఆర్ఎస్ కి అసెంబ్లీలో 100 సంఖ్యాబలం ఉండటంతో ఈ రెండు స్థానాలు ఆ పార్టీకే [more]
రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో తెలంగాణ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. టీఆర్ఎస్ కి అసెంబ్లీలో 100 సంఖ్యాబలం ఉండటంతో ఈ రెండు స్థానాలు ఆ పార్టీకే [more]
రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో తెలంగాణ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. టీఆర్ఎస్ కి అసెంబ్లీలో 100 సంఖ్యాబలం ఉండటంతో ఈ రెండు స్థానాలు ఆ పార్టీకే దక్కడం ఖాయమైంది. దాంతో గులాబీ శిబిరంలో ఇప్పుడు రాజ్యసభపై కన్నేసిన వారు కేసీఆర్ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కె కేశవరావు కి మరోసారి గులాబీ బాస్ టిక్ పెడతారా ? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్న చర్చ పార్టీలో సాగుతుంది.
వారికేనా ఛాన్స్ ….
ఢిల్లీ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న కే.కేశవరావు కి తిరిగి ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు గులాబీ శ్రేణులు. కారు పార్టీ అధినేత తో కేకే కి వున్న సంబంధాల రీత్యా ఆ టాక్ వినవస్తుంది. ఆశావహుల లిస్ట్ లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మధుసూదనాచారి, వినోద్ లు వున్నారని చెబుతున్నారు. వీరిలో మరి ఆయన ఎవరికి అవకాశం కల్పిస్తారో అన్న చర్చ నడుస్తుంది. మార్చి మొదటి వారంలోనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
అన్ని పరిగణనలోకి తీసుకుని….
అయితే సామాజికవర్గాల సమీకరణ ను పరిగణలోనికి తీసుకునే పార్టీ నేతల్లో ఇద్దరిని అధినేత ఎంపిక చేస్తారని గులాబీ శిబిరంలో చెబుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అధినేత పలువురికి హామీ ఇవ్వడంతో ఇప్పుడు తెలంగాణాలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వేడిపుట్టిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు సయితం ఓటమి పాలయ్యారు. వారిలో కుమార్తె కవిత కూడా ఉన్నారు. అలాగే పార్టీ కోసం సీటును త్యాగం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు కూడా ఉన్నారు. వీరిందరిలో ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ పార్టీలో టెన్షన్ పుట్టిస్తుంది. కేసీఆర్ మాత్రం ఫుల్లు క్లారిటీతో ఉన్నారన్నది సన్నిహితుల నుంచి విన్పిస్తున్న మాట.