వారందరినీ డమ్మీలను చేస్తున్నారా?
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది ? అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటి ? ఎవరిని ఆయన చేర దీస్తున్నారు ? ఎవరికి పెద్ద పీట [more]
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది ? అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటి ? ఎవరిని ఆయన చేర దీస్తున్నారు ? ఎవరికి పెద్ద పీట [more]
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది ? అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటి ? ఎవరిని ఆయన చేర దీస్తున్నారు ? ఎవరికి పెద్ద పీట వేస్తున్నారు ? ఎవరిని పక్కన పెడుతున్నారు ? ఈ చర్చ ఇప్పుడు ఆసక్తి కరంగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం.. పార్టీని నమ్ముకుని, ముఖ్యంగా కేసీఆర్‌పై నమ్మకంతో ఇతర పార్టీల నుంచి వచ్చి.. టీఆర్ఎస్‌కు జై కొట్టిన చాలా మంది సీనియర్లను ఇప్పుడు పార్టీ అధినేత పట్టించుకోవడం మానేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారు కూడా వీరిలో ఉండడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఇలాంటి వారు తర్జన భర్జన పడుతున్నారు.
పక్కనపెట్టిన వారు….
తమ భవిష్యత్ ఏంటని తల్లడిల్లుతున్నారు. ఇలా పక్కన పెట్టిన నాయకుల్లో మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వేణుగోపాల చారి, మందా జగన్నాథం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్వామి గౌడ్, మధు సూదనా చారి, ఏనుగు రవీందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వంటి వారిపేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి వీరికి గత నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ మంచి మంచి పదవులే ఇచ్చారు.
ఎదురు చూపులేనా?
కొందరికి స్నేహ పూర్వకంగా, మరికొందరికి సామాజిక వర్గాల పరంగా,ఇంకొందరికి పార్టీలో బాగా కష్టపడ్డారనే ఉద్దేశంతోనూ కేసీఆర్.. వారికి కీలకమైన పదవులను కట్టబెట్టారు. అయితే, వీరంతా కూడా చాలా వరకు వివాదమయ్యారనే విషయాన్ని ఎవరూ విస్మరించలేరు. దీంతో అప్పట్లో వీరిని కేసీఆర్ పక్కనపెట్టారు. అయితే, ఇటీవల కాలంలో వీరు మళ్లీ కేసీఆర్ కు పార్టీకి కూడా అను కూలంగా వ్యవహరిస్తున్నారు. అయినా కూడా కేసీఆర్ వీరిని పట్టించుకోక పోవడం గమనార్హం. అయితే, వీరు మాత్రం కేసీఆర్‌పై ఎనలేని నమ్మకంతో తమకు మళ్లీ గుర్తింపు ఇవ్వకపోతాడా అంటూ ఎదురు చూస్తున్నారు.
సీనియర్లను కాదని…..
ఇక పైన చెప్పుకున్న వారిలో కేసీఆర్ పక్కన పెట్టిన నేతలు కొందరు ఉంటే.. ఎన్నికల్లో సీట్లు ఇచ్చినా ఓడిపోయిన నేతలు కూడా ఉన్నారు. ఇక కీలక నేతలు ఓడిపోయిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వచ్చేయడంతో ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్లు డమ్మీలు అయిపోయారు. తాజాగా రాష్ట్రంలోని వివిధ చైర్మన్ పోస్టులను 30 దాకా భర్తీ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఆయా పోస్టులకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. అయితే, సీనియర్లను పక్కన పెట్టిన నేపథ్యంలో ఆయా పోస్టులకు ఎవరిని నియమిస్తారు? ఇక, సీనియర్ల పరిస్థితి ఏంటి ? వారి ఫ్యూచర్ ఏంటి ? అనే సందేహాలు ముసుకున్నాయి. మరి వీరి పదవుల విషయంలో ఏం జరుగుతుందో కేసీఆర్ ఎలా ? డిసైడ్ చేస్తారో చూడాలి.