కేసీఆర్ కీలక ప్రకటన.. దేనిపైనంటే…?
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ ఎవరి అంచనాలకు అందని పథకాలు ప్రవేశ పెడుతారనేది పేరు.ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న [more]
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ ఎవరి అంచనాలకు అందని పథకాలు ప్రవేశ పెడుతారనేది పేరు.ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న [more]
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ ఎవరి అంచనాలకు అందని పథకాలు ప్రవేశ పెడుతారనేది పేరు.ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ రైతుల కోసం మరొకొత్త పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఎలాంటి పథకాన్ని అమలు చేస్తారో ఆన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
రైతుల సంక్షేమం కోసం….
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు జాతీయస్థాయిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కొన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధు పథకం జాతీయ స్థాయిలో అమలు చేస్తోంది. రైతు బంధు పథకం తో రైతులకు అత్యంత చేరువైన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసమే మరో పథకానికి ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
కొత్తగా ప్రవేశపెట్టబోయే….
రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతుల్లో చెరగని మార్కు వేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకం పై భిన్న రకాల చర్చలు వినిపిస్తున్నాయి. నియంత్రిత పంటల సాగు విధానం రాష్ట్రంలో ఈ వానాకాలం నుంచే అమలు చేయనున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగానే కొత్త పథకాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఆయా పంటలకు సంబంధించిన విత్తనాలు ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే రైతు బంధు…
రైతుబంధు ద్వారా ఏటా దాదాపు 15 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వేచిస్తోంది. ఎరువులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చెసినా మరో 6 నుంచి 8వేల కోట్ల రూపాయల వరకు రైతులకు లబ్ధి చేకూర్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రైతుకు వర్తించే రైతు బీమా పథకం మాదిరిగానే పంటల బీమా వర్తింపజేయాలని ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నారు. తద్వారా రైతు పంట నష్టపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం రైతుకు ఉండదని అంటున్నారు. ఈ పథకం అమలుకు పంటల భీమా కోసం బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జూన్ రెండున కొత్త పథకం….
ప్రభుత్వం అమలు చేసే నియంత్రిత పంటల సాగు విధానం లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా పంటలబీమా పథకాన్ని అమలు చేసినట్లయితే ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. రైతులు పండించే పంటలపై నేరుగా ఆర్థికంగా లబ్ధి చేకూర్చే పథకం ఉండవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ప్రకటించే కొత్త స్కీముపై విపక్షాలు సయితం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.