అన్ లాక్ చేస్తారా? లేదా ….?
లాక్ డౌన్ 5.0 మార్గదర్శకత్వాలను కేంద్రం విడుదల చేసింది. అంతరాష్ట్ర ప్రయాణ రాకపోకలపై ఆంక్షలు ఇందులో సడలించింది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించుకునే [more]
లాక్ డౌన్ 5.0 మార్గదర్శకత్వాలను కేంద్రం విడుదల చేసింది. అంతరాష్ట్ర ప్రయాణ రాకపోకలపై ఆంక్షలు ఇందులో సడలించింది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించుకునే [more]
లాక్ డౌన్ 5.0 మార్గదర్శకత్వాలను కేంద్రం విడుదల చేసింది. అంతరాష్ట్ర ప్రయాణ రాకపోకలపై ఆంక్షలు ఇందులో సడలించింది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించుకునే అవకాశం ఆయా రాష్ట్రాల కు వదిలివేసింది. దాంతో ఇప్పుడు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దేశవ్యాప్తంగా ఇంకా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు, అత్యవసర పనులపై వెళ్ళాలిసినవారికి ఇక్కట్లు తప్పేలా లేవు.
తెలంగాణ లో కేసీఆర్ ఏం చేస్తారు …?
తెలంగాణ లో లాక్ డౌన్ కి సంబంధించి కేంద్రం ఇస్తున్న మార్గదర్శకత్వాలకు భిన్నమైన రూట్లో కేసీఆర్ వెళుతున్నారు. కేంద్రం లాక్ డౌన్ పొడిగించకుండానే ఒక్కో సందర్భంలో ఆయన ఇక్కడ మాత్రం పొడిగిస్తున్నాం అంటూ ప్రకటనలు చేసిన సందర్భం ఉంది. అంత రాష్ట్ర రవాణాపై రాష్ట్రాల ఇష్టం అని గతంలోనే బస్సు సర్వీసులపై కేంద్రం గత లాక్ డౌన్ లోనే ప్రకటించినా కేసీఆర్ అనుమతించలేదు. ఇప్పుడు ఈ పాస్ విధానం కూడా తీసేసారు.
టెన్షన్ పెడుతున్న మహారాష్ట్ర …
అయితే మహారాష్ట్ర సరిహద్దు గా ఉండటం అక్కడ దేశంలోనే అత్యధిక కేసులు నమోదు కావడంతో కేసీఆర్ హడలిపోతున్నారు. గేట్లు ఎత్తేస్తే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందనే ఆందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు గేట్లు మూసి, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తెరుస్తారా? లేక మొత్తం క్లోజ్ చేసే నిర్ణయమే తీసుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో చిక్కుకున్న వేలమంది ఏపీ వాసులు, అలాగే ఏపీలో ఉండిపోయిన వేలమంది భాగ్యనగర్ వాసులు సర్కార్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టి సర్కార్ ఎలాంటి అడుగులు వేయనుందో చూడాలి.