కయ్యానికి కాలు దువ్వుతున్న రెండు పార్టీలు

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే బిజెపి నాలుగు సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షం గా ఎదుగుతుందో కే చంద్రశేఖర్ రావు ఆ పార్టీ పై ఒక కన్నేశారు. [more]

Update: 2019-06-19 03:30 GMT

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే బిజెపి నాలుగు సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షం గా ఎదుగుతుందో కే చంద్రశేఖర్ రావు ఆ పార్టీ పై ఒక కన్నేశారు. ఇక ఉపేక్షిస్తూ కూర్చుంటే భవిష్యత్తులో గులాబీ పార్టీ మనుగడే కష్టమన్న దూర దృష్టితో అడుగులు వేస్తున్నారు ఆయన. రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అయిన ఆయన కాషాయ దళంకి చెక్ పెట్టేందుకు అనుసరించాలిసిన ఫార్ములా తయారు చేసే పనిలో పడ్డారు. తాజాగా కెసిఆర్ చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దంపడుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కమల దళాన్ని ఇప్పుడే అడ్డుకొని సాధ్యమైనంత తగ్గించే ప్రణాళిక కారుపార్టీ రూపొందిస్తుంది.

మోడీ, షా లపై పంచ్ లపై పంచ్ లు…

గతంలోను వర్తమానంలో గులాబీ అధినేత ఎన్డీయేకు దగ్గర కాకుండా దూరం కాకుండా వ్యవహారం నరుకొస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్ట్ ల అనుమతుల నుంచి అన్నిటా ఆయనకు కేంద్రంలో పనులు శరవేగంగా నడుస్తూ వచ్చాయి. తన వ్యూహ చతురతతో టి కాంగ్రెస్ ను దాదాపు బొంద పెట్టిన ఆయనకు బిజెపి తాజా విజయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దాంతో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాని మోడీకి ఆహ్వానించే ఆలోచన కూడా చేయలేదు ఆయన. పైపెచ్చు తాజా మీడియా సమావేశంలో ప్రధాని మోడీ, అమిత్ షా లపై తనదైన శైలిలో పంచ్ లు విసిరారు. సెటైర్లు కు అయితే కొదవే లేదు. తెలంగాణ ప్రాజెక్ట్ లకు కేంద్రం పైసా సాయం చేయలేదంటూ పదేపదే చెప్పుకొచ్చారు. తద్వారా బిజెపి పట్ల ఆకర్షితులు అవుతున్న తెలంగాణ ప్రజలకు కమలం తమ ప్రాంతానికి చేసింది నిల్ అని తేల్చేశారు కెసిఆర్. కేంద్రంపై కొన్ని అంశాలతో ఏకీభవిస్తామని తెలంగాణ కు నష్టం అనుకుంటే విభేదిస్తామని వ్యాఖ్యానించి రాబోయే రోజుల్లో కారు టార్గెట్ ఎవరో చెప్పక చెప్పేసారు గులాబీ దళపతి

Tags:    

Similar News