సిసలైన వారసుడు కేటీఆర్ !

కేసీఆర్. తెలంగాణాను తెచ్చారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఓ సాధారణ నాయకుడిగా టీడీపీలో ఎంట్రీ ఇచ్చిన కె. చంద్రశేఖరరావు కేసీఆర్ గా మారడానికి సుదీర్ఘమైన ప్రయాణమే చేశారని [more]

Update: 2020-08-24 00:30 GMT

కేసీఆర్. తెలంగాణాను తెచ్చారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఓ సాధారణ నాయకుడిగా టీడీపీలో ఎంట్రీ ఇచ్చిన కె. చంద్రశేఖరరావు కేసీఆర్ గా మారడానికి సుదీర్ఘమైన ప్రయాణమే చేశారని చెప్పాలి. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే కేసీఆర్ కి మంత్రి పదవి దక్కింది. ఆ తరువాత ఆయనకు రెండవసారి అవకాశం రాలేదు, ఉప సభాపతి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పెట్టి ఎంత ఎత్తుకు ఎదిగారో అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన రాజకీయ చాణక్యంతో పాటు చతురత చూపించి జాతీయ పార్టీలన్నింటినీ ఆకట్టుకున్నారు. మొత్తానికి తెలంగాణాను తెచ్చి చరిత్రలో నిలిచారు.

వారసుడిగా…

రాజకీయాల్లో వారసులు రావడం సాధారణమే. అలా కేటీయార్ కూడా తండ్రి వెంబడి వచ్చారు ఆయనకు కేసీఆర్ ఇచ్చింది చక్కని భాషను, సమయస్పూర్తిగా మాట్లాడడంతో పాటు రాజకీయ చతురత కూడా. దానిని పునాదిగా చేసుకుని కేటీయార్ ఈ రోజు చాలా ముందుకు వెళ్ళిపోయారు. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని గుప్పిట పట్టిన కేటీయార్ తండ్రి కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రజా సేవలో తరిస్తున్నారు. తపిస్తున్నారు. ఇది అంత ఆషామాషీ విషయం కాదు కూడా.

జనంలోనే …..

కేసీఆర్ వయసు 66 ఏళ్ళు. ఆయన ఇపుడున్న కరోనా వేళ జనంలోకి రావడం అంటే రిస్క్. అందుకే 44 ఏళ్ళున్న కేటీయార్ జనం మధ్యన ఉంటున్నారు. కష్టనష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రతి రోజూ జనంలోనే ఆయన కనిపిస్తున్నారు. ప్రభుత్వం జనం వద్దకు అన్న సూత్రాన్ని ఆయన కచ్చితంగా అమలు చేస్తున్నారు. నిజానికి దేశంలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కరోనా వేళ తమ నివాసాలకే పరిమితమై పాలన చేస్తున్న పరిస్థితుల్లో కేటీయార్ కొత్త ఒరవడి ప్రవేశపెట్టారు. కరోనా అయినా వరదలు వచ్చినా కూడా జనంలోకి వెళ్తేనే వారికి భరోసా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. అదే విధంగా అధికార యంత్రాంగం పరుగులు పెడుతుందని కూడా తెలుసు కాబట్టే తాను ముందుండి మరీ పనిచేయిస్తున్నారు.

కూర్చోబెట్టి…..

కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా అలా కూర్చోబెట్టి మొత్తం భారాన్ని కేటీయార్ వేసుకుంటున్న తీరు చూస్తే ఎవరైనా స్పూర్తి పొందాల్సిందే. ఆయన చేతిలో కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అంతే కాదు ఆయన ముఖ్యమంత్రి స్థానంలోకి కూడా వెళ్లి మరీ మంత్రివర్గ సమావేశాలను కూడా నిర్హహిస్తున్నారు. కేటీయార్ భావి ముఖ్యమంత్రి అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే అది చాలదు, ప్రజాస్వామ్యంలో సర్వాజనామోదం కావాలి. అందుకే ముందుగా పార్టీ నేతలందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇక జనంలో కూడా ఉంటూ వారి ఓటు కూడా తనకే అనుకూలం చేసుకుంటున్నారు. దాంతో రేపటి రోజున కేసీఆర్ తన కుమారుడికి సీఎం పీఠం అప్పగించినా కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు కాక చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే తండ్రులు అధిష్టించిన సీఎం సీటును పట్టేసిన వారిలో జగన్ తరువాత కేటీయార్ కూడా తెలుగు రాష్ట్రాల చరిత్రలో నిలుస్తారు.

Tags:    

Similar News