Kakani : కాకాణిని అక్కడి నుంచి షిఫ్ట్ చేసింది అందుకేనా?

వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డిని జగన్ దర్శి మున్సిపాలిటీ ఇన్ ఛార్జిగా నియమించారు. ఇటీవలే బద్వేలు ఉప ఎన్నిక కోసం అక్కడకు వెళ్లిన కాకాణిని వెంటనే [more]

;

Update: 2021-11-03 12:30 GMT

వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డిని జగన్ దర్శి మున్సిపాలిటీ ఇన్ ఛార్జిగా నియమించారు. ఇటీవలే బద్వేలు ఉప ఎన్నిక కోసం అక్కడకు వెళ్లిన కాకాణిని వెంటనే దర్శికి పంపారు. బద్వేలు లో పూర్తి స్థాయిలో వైసీపీ విజయం సాధించింది. 90 వేలకు పైగా మెజారిటీ సాధించింది. అందరి కృషి వల్లనే ఈ మెజారిటీ సాధ్యమయింది. అయితే వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలకు, నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి.

రెండు ఎన్నికలకు….?

నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కాకాణి గోవర్థన్ రెడ్డి ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు ఈ జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా ఈ ఎన్నికలను పర్యవేక్షించాల్సిన కాకాణి గోవర్థన్ రెడ్డిని దర్శి మున్సిపాలిటీకి ఇన్ ఛార్జిగా పంపడం పార్టీలో చర్చనీయాంశమైంది. సొంత జిల్లాలో ఎన్నికలకు కాకుండా పొరుగు జిల్లాకు పంపడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

గ్రూపుల గొడవతోనే..?

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రూపుల గొడవ తీవ్రంగా ఉంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో కాకాణి గోవర్థన్ రెడ్డికి పడదు. వీరు గత కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో వీరి మధ్య ఉన్న విభేదాలు మరింత ముదురుతాయని భావించి కాకాణి గోవర్థన్ రెడ్డిని దర్శికి జగన్ పంపి ఉంటారన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి.

దర్శిలోనూ అంతే…?

అదే సమయంలో దర్శి నియోజకవర్గంలోనూ విభేదాలు తీవ్రంగానే ఉన్నాయి. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య పొసగడం లేదు. వీరి మధ్య నెలకొన్న విభేదాలతో దర్శి మున్సిపాలిటీలో వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని జగన్ భావించారంటున్నారు. అందుకే కాకాణి గోవర్థన్ రెడ్డిని దర్శి ఇన్ ఛార్జిగా పంపారని చెబుతున్నారు. మొత్తం మీద కాకాణిని జగన్ నెల్లూరు ఎన్నికలకు దూరం చేశారనే చెప్పాలి.

Tags:    

Similar News