కళా కూడా జంపేనా ?
ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు రాజకీయ భవితవ్యం మీద ఇపుడు చర్చ సాగుతోంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గిరీ నుంచి [more]
ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు రాజకీయ భవితవ్యం మీద ఇపుడు చర్చ సాగుతోంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గిరీ నుంచి [more]
ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు రాజకీయ భవితవ్యం మీద ఇపుడు చర్చ సాగుతోంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గిరీ నుంచి కళా వెంకటరావును బాబు తప్పించేశారు. తన అనుంగు శిష్యుడు, పెద్ద నోరున్న అచ్చెన్నాయుడుకు ఆ పదవి ఇచ్చేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో కళా పరిస్థితి ఎటూ కాకుండా తయారైందని టీడీపీలో తమ్ముళ్ళు అంటున్నారు. కళా వెంకటరావు రాజకీయం మొదలెట్టినపుడు అచ్చెన్న ఏమీ కాడు, ఆయన అన్న ఎర్రన్నాయుడుతోనే కళా ఢీ కొట్టి మరీ పాలిటిక్స్ నడిపారు. ఇక ఎర్రన్నాయుడు జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే కళా వెంకటరావు హోం శాఖతో సహా కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఘనమైన చరిత్ర కలిగిన కళా వారి కుటుంబం నుంచి వచ్చిన దిగ్గజ నేతగా ఆయనకు పేరు.
వర్గ పోరుతో….
ఇక సిక్కోలు జిల్లాలో కళా, కింజరాపు వర్గాలకు ఎపుడూ పడదు అని అంటారు. కళా వెంకటరావు వర్గం వేరు, ఆయన రాజకీయం వేరు. ఎర్రన్నాయుడు దూకుడుగా రాజకీయం చేస్తున్న వేళ జిల్లాలో వర్గ పోరు లేకుండా చూసేందుకు చంద్రబాబు ఆయన్ని ఎంపీగా పంపి ఢిల్లీకి పరిమితం చేశారు. దాంతో కళా వెంకటరావు హవా సిక్కోలులో సాగుతూ వచ్చింది. ఎపుడైతే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచీ కొంత ఇబ్బంది ఎదురైంది. ఆ పరిణామాల నేపధ్యంలోనే కళా వెంకటరావు 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. అక్కడ తనతో పాటు పార్టీ కూడా ఓడడంతో ఆయన తిరిగి 2014 ఎన్నికల వేళకు చంద్రబాబు గూటికి చేరారు.
కాపు కాయరా…..?
ఇక కళా వెంకటరావు తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఉత్తరాంధ్రా జిల్లాల్లో బలమైన సామాజికవర్గంగా ఉంది. వెలమలకు కాపులకు ఎపుడూ పడదు, సామాజికవర్గాల పొత్తు కుదరదు, ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు సిక్కోలు జిల్లా అనగానే కింజరాపు కుటుంబానికే పెద్ద పీటవేయడం కూడా మిగిలిన సామాజికవర్గాలకు గుర్రుగా ఉంది. ఇప్పటికే కాళింగులు వైసీపీకి గుత్తమొత్తంగా మద్దతు ఇస్తున్నారు. మరో వైపు తూర్పు కాపులు కూడా అటూ ఇటూ ఉన్నారు. ఇపుడు కళా వెంకటరావును తగ్గించి అచ్చెన్నకు కిరీటం పెడితే తూర్పు కాపులు కూడా వైసీపీ వైపుగా పూర్తిగా మళ్ళుతారని అంటున్నారు. దానికి తోడు అచ్చెన్నతో పడని వర్గాలు కూడా టీడీపీకి నష్టం కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
వైసీపీలోకా…?
మరో వైపు చూస్తే టీడీపీలో ఇక తన రాజకీయం ఎదగదని కళా వెంకటరావు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆధిపత్య పోరులో అచ్చెన్నది పై చేయి కావడంతో ఆయన తప్పకుండా కళా వర్గాన్ని తగ్గించాలని చూస్తారు. ఇంకో వైపు చంద్రబాబు మోజు అచ్చెన్న మీద ఉంది. దాంతో సెకండ్ గ్రెడ్ లీడర్ గా ఇంతటి సీనియర్ నేతా ఉండాల్సిన స్థితి వస్తుంది. ఈ రకమైన సమీకరణల నేపధ్యంలో కళా వెంకటరావు టీడీపీని వీడుతారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఆయన కనుక వస్తే చేర్చుకోవడానికి వైసీపీ రెడీగా ఉంది. తూర్పు కాపుల్లో బలమైన నేతగా ఉన్న కళా వెంకటరావు చేరికతో ఉత్తరాంధ్రాలో ఆ సామాజికవర్గానికి ఒక సంకేతం పంపినట్లు అవుతుందని భావిస్తోంది. మొత్తానికి అచ్చెన్న నాయకత్వంలో ఉత్తరాంధ్రాలో టీడీపీ బలపడుతుంది అని చంద్రబాబు సంబరపడవచ్చు కానీ సీన్ చూస్తే కాలేట్టుగానే ఉందని విశ్లేషణలు అయితే ఉన్నాయి.