కంభంపాటి కూడా బాబుకు దూరమయ్యారా?
అధికారంలో ఉన్నప్పుడే కన్పిస్తారు. పదవుల కోసం పైరవీలు చేస్తారు. ఆ తర్వాత సొంత వ్యాపారాలే వారికి ప్రధానం. పార్టీ ఎటు వెళ్లినా, ఏమై పోయినా వారికి పట్టదు. [more]
అధికారంలో ఉన్నప్పుడే కన్పిస్తారు. పదవుల కోసం పైరవీలు చేస్తారు. ఆ తర్వాత సొంత వ్యాపారాలే వారికి ప్రధానం. పార్టీ ఎటు వెళ్లినా, ఏమై పోయినా వారికి పట్టదు. [more]
అధికారంలో ఉన్నప్పుడే కన్పిస్తారు. పదవుల కోసం పైరవీలు చేస్తారు. ఆ తర్వాత సొంత వ్యాపారాలే వారికి ప్రధానం. పార్టీ ఎటు వెళ్లినా, ఏమై పోయినా వారికి పట్టదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. అక్రమ కేసులు, పార్టీని వీడుతున్న నేతలతో టీడీపీ గతంలో ఎన్నడూ లేని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో అధినేత చంద్రబాబుకు అండగా నిలవాల్సిన ముఖ్యనేతలందరూ ముఖం చాటేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందులో కంభంపాటి రామ్మోహనరావు ఒకరు.
టీడీపీలోనే ఎదిగి…..
తెలుగుదేశం పార్టీలోనే కంభంపాటి రామ్మోహన్ రావు ఎదిగారు. ఎన్టీఆర్ హయాం నుంచే ఆయన ఎదుగుదల పార్టీలో ప్రారంభమయింది. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేశారు. చంద్రబాబు కూడా తన హయాంలో మంచి ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే కంభంపాటి రామ్మోహనరావును ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించారు. ఢిల్లీలో లాబీయింగ్ కు కంభంపాటిని చంద్రబాబు ఉపయోగించుకున్నారు.
అధికారం కోల్పోయిన నాటి నుంచి…..
ప్రభుత్వం మారడంతో కంభంపాటి రామ్మోహన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కంభంపాటి రామ్మోహన్ రావవు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాజధాని భూముల కొనుగోళ్లలో ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వచ్చినప్పుడు మాత్రం స్పందించారు. తర్వాత కంభంపాటి రామ్మోహన్ రావు పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. తన కుటుంబ సభ్యుల పేర్లు రావడంతో పాటు పార్టీ నాయకత్వంపై ఆయనకున్న అసంతృప్తి కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.
సుజనాతో విభేదాలే….
నిజానికి సుజనా చౌదరికి రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసే సమయంలో కంభంపాటి రామ్మోహన్ రావు రాజ్యసభ పదవిని ఆశించారు. అయితే సుజనాకు రెండోసారి కూడా రాజ్యసభ పదవిని రెన్యువల్ చేయడంతో కంభంపాటి రామ్మోహన్ రావు హర్ట్ అయ్యారంటున్నారు. సుజనా చౌదరికి, కంభంపాటి రామ్మోహన్ రావుకు గతంలో విభేదాలు తలెత్తినప్పుడు చంద్రబాబు సుజనా వైపు నిలబడ్డారంటున్నారు. కొంతకాలం చంద్రబాబు కంభంపాటి రామ్మోహన్ రావుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఈ కారణంతోనే ఆయన పార్టీ అధికారానికి దూరమయిన నాటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.