అలా టార్గెట్ చేస్తే ఎలా..? వైసీపీలో బిగ్ డిస్కషన్
వైసీపీ నేతల మధ్య చీలిక కనిపిస్తోంది. ఇది నిజమేనంటున్నారు సీనియర్లు. రాష్ట్రంలో ఏం జరిగినా కూడా సీఎం నుంచి మంత్రులు, కింది స్థాయి నాయకుల వరకు అందరూ [more]
వైసీపీ నేతల మధ్య చీలిక కనిపిస్తోంది. ఇది నిజమేనంటున్నారు సీనియర్లు. రాష్ట్రంలో ఏం జరిగినా కూడా సీఎం నుంచి మంత్రులు, కింది స్థాయి నాయకుల వరకు అందరూ [more]
వైసీపీ నేతల మధ్య చీలిక కనిపిస్తోంది. ఇది నిజమేనంటున్నారు సీనియర్లు. రాష్ట్రంలో ఏం జరిగినా కూడా సీఎం నుంచి మంత్రులు, కింది స్థాయి నాయకుల వరకు అందరూ ఏక బిగిన కమ్మ సామాజిక వర్గంపై చేస్తున్న విమర్శలు నిన్న మొన్నటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో చేసిన విమర్శలపై మాత్రం వైసీపీ నాయకుల్లోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రం మానసికంగా తీవ్రంగా నొచ్చుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త చర్చ వైసీపీలో చోటు చేసుకుంది.
ఆ వర్గాన్ని దూరం….
దీంతో ఈ పరిణామాలపై వైసీపీలో సీనియర్లు ఫోన్లలోనే తమ మనసులో మాటలను వ్యక్తీకరిస్తున్నారు. “అన్నా.. ఇలా కమ్మ వారి పై విరుచుకుపడడం ఏమంత బాగోలేదు“ అని వారు చెప్పుకోవడం కనిపిస్తోంది. అదే సమయంలో ఒక వర్గాన్ని మనం పూర్తిగా దూరం చేసుకుంటున్నామేమో..? అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లోనూ, దీనికి ముందు పాదయాత్రలోనూ కమ్మ సామాజిక వర్గంనాయకులు కూడా పార్టీకి లక్షల్లో విరాళాలు ఇచ్చారని, కేవలం టీడీపీలోని కమ్మవారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యల కారణంగా మొత్తం సామాజిక వర్గం అంతా కూడా నొచ్చుకునే పరిస్థితి వచ్చిందని ఇలాంటి పరిణామాలు గతంలో ఏ పార్టీలోనూ లేవనివారు చెప్పుకొంటున్నారు.
కోటలు బద్దలు కొట్టినా….
అంతేకాదు, గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం కోటలుగా టీడీపీ భావించిన పొన్నూరు, తెనాలి, వినుకొండ, చిలకలూరిపేట, మైలవరం… నరసారావుపేట ఎంపీ సీటు.. దెందులూరు తదితర నియోజకవర్గాల్లోనూ మనం గెలిచామని వైసీపీ నాయకులు చెప్పుకొంటున్నారు. ప్రతి సామాజిక వర్గమూ కూడా వైసీపీకి అండగా నిలిచిందని, ఇప్పుడు మనోళ్లు చేస్తున్న చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కమ్మ సామాజికవర్గానికి మనం దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని వైసీపీలోని కొందరు నేతలు అంటున్నారు. ఇప్పుడు గెలిచాం.. మన ప్రణాళిక మేరకు మరో ముప్పై ఏళ్లు అధికారంలో ఉండాలని నిర్ణయించుకున్నాం.
ఎంత వరకూ సమంజసం?
అయితే, ఎన్నికల్లో అందరి ఓట్లతోనే గెలిచామని, వచ్చే ఏ ఎన్నికల్లో అయినా కూడా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సైలెంట్‌గా జరుగుతున్న ఈ చర్చ రేపు జగన్ దృష్టికి వెళ్తుందో వెళ్లదో చూడాలి. వెళ్తే ఏం జరుగుతుందనేది కూడా ఆసక్తిగానే ఉంది.