జగన్ న్యాయం చేశారా?
విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ముఖ్యమంత్రి జగన్ కీలకమైన పదవిని కట్టబెట్టారు. అందరూ అనుకుంటున్నట్లుగానే ప్రతిష్టాత్మకమైన తిరుమల [more]
విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ముఖ్యమంత్రి జగన్ కీలకమైన పదవిని కట్టబెట్టారు. అందరూ అనుకుంటున్నట్లుగానే ప్రతిష్టాత్మకమైన తిరుమల [more]
విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ముఖ్యమంత్రి జగన్ కీలకమైన పదవిని కట్టబెట్టారు. అందరూ అనుకుంటున్నట్లుగానే ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మెంబర్ గా అవకాశం కల్పించారు. ఇప్పటికి మూడు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన కన్నబాబు రాజు మంత్రి పదవి కోసమే గట్టిగా ప్రయత్నం చేశారు. తనకు తప్పక జగన్ అవకాశం ఇస్తారని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణల నేపధ్యంలో జగన్ కన్నబాబు రాజును పక్కన పెట్టారు. అయితే ఆనాడే జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. కీలకమైన పదవిని ఇస్తామని కూడా చెప్పారు. దానిప్రకారమే కన్నబాబు రాజుకి టీటీడీ మెంబర్ పదవి దక్కిందని అంటున్నారు.
అరుదైన గౌరవమే……
నిజానికి మంత్రి పదవిని ఆశించిన వారికి టీటీడీ పదవి కీలకమైనదే. దీన్ని క్యాబినెట్ ర్యాంక్ పదవిగా భావిస్తారు. చాలా మంది నేతలు టీటీడీ మెంబర్ కావాలని కోరుకుంటారు. రాజకీయంగా కూడా ఈ పదవిని ఉపయోగించుకునే వారు కూడా ఉన్నారు. దర్శనం ఇతర సిఫార్సు లేఖలు ఇచ్చేందుకు అవకాశం అధికారం ఉన్న పదవి కావడంతో క్రేజ్ బాగానే ఉంటుంది. దాంతో కన్నబాబు రాజు అనుచరులు తమ నేతకు కొంతకాలం ఆగినా మంచి పదవే దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నబాబు రాజు సైతం తాను మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చానని అనుకుంటున్నారు. ఆయన తాజా ఎన్నికల్లో ఎలమంచిలి నియోజకవర్గంలో అనేక వ్యతిరేక పరిస్థితుల మధ్య గెలిచారు. జగన్ పాదయాత్ర సందర్భంగా పార్టీలో చేరిన కన్నబాబు రాజు బలమైన కాపు సామాజిక వర్గం నేతలు పార్టీని వీడినప్పటికి తనకున్న రాజకీయ చాణక్యంతో, జగన్ ఇమేజ్ తో మంచి మెజారిటీ సాధించారు.
వారసుడు రెడీ…..
ఇక కన్నబాబు రాజు ఈ టెర్మ్ తో రాజకీయాల నుంచి తప్పుకుందామని అనుకుంటున్నారు. దాంతో ఆయనకు సరైన సమయంలో దేవుడుకి సేవ చేసుకునే అవకాశం దక్కిందని అంటున్నారు. ఇక కన్నబాబు రాజు కుమారుడు సుకుమార్ వర్మ రాజకీయ వారసుడిగా అపుడే రెడీగా ఉన్నాడు. ఆయన విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ గా గత అయిదేళ్ళుగా పనిచేస్తున్నారు. వైసీపీలో ఆయన కుటుంబం చేరడంతో ఆ పదవి నుంచి అప్పటి టీడీపీ సర్కార్ తొలగించినా వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఆయనకు చైర్మన్ పదవి దక్కింది. అలా కన్నబాబు రాజు కుటుంబానికి రెండు పదవులు ఇచ్చి జగన్ సముచిత స్థానమే కల్పించారని అంటున్నారు. మరో వైపు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కన్నబాబు రాజు తనదైన వ్యూహ రచన చేస్తున్నారు. మొత్తానికి మాట తప్పని జగన్ కన్నబాబు రాజుకు న్యాయం చేశారని అంటున్నారు.