కారుమూరి ఆశ బాగుందికాని.. తీరేదెట్టా ?
రాజకీయాల్లో ఉన్నవారికి ఆశలు ఉండడం సహజం. అయితే.. అవి ఏమేరకు తీరతాయి? అనేది ప్రధాన ప్రశ్న. ఎంతో మంది నాయకులు గత ఎన్నికల అనంతరం.. జగన్ కేబినెట్‌లో [more]
రాజకీయాల్లో ఉన్నవారికి ఆశలు ఉండడం సహజం. అయితే.. అవి ఏమేరకు తీరతాయి? అనేది ప్రధాన ప్రశ్న. ఎంతో మంది నాయకులు గత ఎన్నికల అనంతరం.. జగన్ కేబినెట్‌లో [more]
రాజకీయాల్లో ఉన్నవారికి ఆశలు ఉండడం సహజం. అయితే.. అవి ఏమేరకు తీరతాయి? అనేది ప్రధాన ప్రశ్న. ఎంతో మంది నాయకులు గత ఎన్నికల అనంతరం.. జగన్ కేబినెట్‌లో చోటు సంపాయించు కునేందుకు ప్రయత్నించారు. ఎన్నో ఆశలు సైతం పెట్టుకున్నారు., పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీతామై వ్యవహరించిన నాయకులు కొందరు ఉంటే.. పార్టీలో జగన్‌కు అత్యంత విధేయులైన నాయకులు కూడా మంత్రి పీఠాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వారందరికీ అవకాశం లభించలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తాజాగా మరో ఏడాదిలో జగన్ తనమంత్రి వర్గాన్ని విస్తరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అనేక మంది మళ్లీ మంత్రి పీఠాలపై ఆశలు పెట్టుకున్నారు.
దెందులూరులో ఓడిపోయి….
ఈ లిస్టులో పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు కూడా ప్రథమ వరుసలో కనిపిస్తున్నారు. ఈయనకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ముక్కోణపు ఫైట్ జరిగింది. ఈ క్రమలో తణుకు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కారుమూరి నాగేశ్వరరావు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. దీనికి ముందు.. జడ్పీ చైర్మన్‌గా చేశారు. వైఎస్ ఆశీస్సులు బలంగా ఉండడంతో పాటు యాదవ సామాజిక వర్గం కోటాలో కారుమూరి 2006లో పశ్చిమ జడ్పీ చైర్మన్ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చిన ఆయన దెందులూరులో ఓడిపోయారు. అనంతరం తిరిగి తణుకు వెళ్లిపోయారు.
సామాజికవర్గం కోటాలో…..
గత 2019 ఎన్నికల్లో మళ్లీ ముక్కోణపు పోటీలో .. వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. వివాదాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన యాదవ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. జడ్పీ చైర్మన్ గా కూడా చేసి ఉండడం, రెండు సార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించడం వంటివి తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మంత్రి పదవి కోసం తన స్థాయిలో లాబీయింగ్ చేయడంతో పాటు వివాదాలకు దూరంగా ఉంటూనే మంత్రి పదవి వస్తే నియోజకవర్గాన్ని ఓ రేంజ్‌లో అభివృద్ధి చేస్తానని స్థానికంగా ప్రచారం కారుమూరి నాగేశ్వరరావు చేసుకుంటున్నారు. కానీ, ఇప్పటికే యాదవ సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ మంత్రిగా ఉన్నారు. ఆయన దూకుడు, జగన్ పట్ల విధేయత ఆయనకు మంచి మార్కులు వేయిస్తున్నాయి.
ఇద్దిరిని తప్పించుకుని…..
దీంతో ఆయనను తప్పిస్తారనే అవకాశం లేదు. పోనీ.. తప్పించినా.. తప్పించకపోయినా.. యాదవులకే మరో మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నా.. మాజీ మంత్రి, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి రెడీ గా ఉన్నారు. ఈయన కూడా వైఎస్‌కు ఆత్మీయుడు. ఈ నేపథ్యంలో ఆయన కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పైగా వైఎస్ హయాంలోనే మంత్రిగా ఉన్న తనను జగన్ పట్టించుకోలేదని ఆయన పెద్ద అలకతో ఉన్నారు. ఇలా.. ఈ ఇద్దరినీ దాటకుని కారుమూరి నాగేశ్వరరావు ఏమేరకు తన ఆశలు నెరవేర్చుకుంటారనేది ఆసక్తిగా మారింది.