కేసీఆర్ కి హీరో వర్షిప్ ? మరి జగన్ సంగతి?
రీల్ హీరోలకు రియల్ హీరోగా కేసీఆర్ కనిపిస్తున్నాడు. తెలంగాణా ముఖ్యమంత్రిగా ఆరేళ్ళుగా కేసీఆర్ ఉంటున్నారు. ఉద్యమ వేళ గులాబీ బాస్ ని టాలీవుడ్ కొంత అనుమానంగా చూసినా [more]
రీల్ హీరోలకు రియల్ హీరోగా కేసీఆర్ కనిపిస్తున్నాడు. తెలంగాణా ముఖ్యమంత్రిగా ఆరేళ్ళుగా కేసీఆర్ ఉంటున్నారు. ఉద్యమ వేళ గులాబీ బాస్ ని టాలీవుడ్ కొంత అనుమానంగా చూసినా [more]
రీల్ హీరోలకు రియల్ హీరోగా కేసీఆర్ కనిపిస్తున్నాడు. తెలంగాణా ముఖ్యమంత్రిగా ఆరేళ్ళుగా కేసీఆర్ ఉంటున్నారు. ఉద్యమ వేళ గులాబీ బాస్ ని టాలీవుడ్ కొంత అనుమానంగా చూసినా మెజారిటీ సెక్షన్ తటస్థంగానే ఉంది. ఆ తరువాత ఎటూ కేసీఆర్ గెలవడం, తమ వ్యాపారాలూ, వ్యాపకాలూ కూడా అన్నీ తెలంగాణాలోనే ఉండడంతో జై కేసీఆర్ అనేసింది టాలీవుడ్. వారూ వీరు అన్న తేడా లేకుండా అంతా కేసీఆర్ ఈజ్ అవర్ బాస్ అని గట్టిగానే ఒకటికి పదిసార్లు చెప్పేశారు. అదే సమయంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యామంత్రిగా ఉన్నారు. టాలీవుడ్ లో మెజారిటీ ఆధిపత్యం ఒక సామాజికవర్గానిదే. దాంతో నాడు కేసీఆర్ ని ఓ వైపు పొగుడుతున్నా మరో వైపు కొన్ని మొహమాటాలు, కులాభిమానాలూ ఉండేవి. ఇపుడు బాబు ఓడిపోవడంతో అవన్నీ గాలికి కొట్టుకుపోయాయి.
ఆచీ తూచీ….
ఇక విరాళాల విషయంలో కూడా టాలీవుడ్ వివేచన చూపించింది. తామున్న ప్రాంతం పట్ల కొంత ప్రేమను కనబరుస్తూనే ఏపీని కూడా పట్టించుకున్నట్లుగా కనిపించింది. ఇక సీనియర్ హీరోలూ, ముదుర్లు అయిన కొందరు ఎటు వైపు ఎక్కువ ఇస్తే ఏమి తేడాలు వస్తాయోనని ఏకంగా తమ సినీ కార్మికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు పోగుచేసుకుని వాటిని ఆ వైపుగా ఉపయోగించారు. ఓ విధంగా తెలంగాణా పట్ల కొంత సానుకూలత టాలీవుడ్ కనబరుస్తూ వచ్చిందనుకోవాలి.
కితాబులే….
ఇంతటితో ఊరుకుంటే బాగుండేదేమో కానీ కేసీఆర్ రియల్ హీరో అంటూ కొంతమంది హీరోలు బాహాటంగా ప్రకటించడం విశేషం. కరోనా వేళ కేసీఆర్ అద్భుతంగా పని చేస్తున్నారని, ఆయన చేతుల్లో తెలంగాణా సేఫ్ అంటూ పరిధులు దాటి కీర్తించేస్తున్నారు. నిజంగా కరోనా మీద పోరాటంలో అన్ని ప్రభుత్వాలూ కష్టపడుతున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకూ ఉమ్మడి ఏపీగా ఉన్న చోట ఇపుడు రెండుగా విడిపోయారు. అలాంటపుడు ఒక రాష్ట్రాన్ని మితిమీరి పొగుడుతున్న వారు రెండవ రాష్ట్రం దాని వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అన్నది కూడా ఆలోచన చేసుకోకపోవడం బాధాకరం.
అవసరం లేదా …?
నిజం చెప్పాలంటే పదమూడు జిల్లాల ఏపీలో హైదరాబాద్ లాంటి నగరం లేదు. పైగా టాలీవుడ్ కి అన్ని సదుపాయాలూ అక్కడ ఉన్నాయి. చంద్రబాబు తమ కులస్థుడు, బాగా దగ్గర మనిషి అయినా కూడా నాడు సినీ పరిశ్రమ ఈ వైపు చూడలేదు. ఇపుడు జగన్ సీఎంగా ఉన్నారు. దాంతో ఏ విధమైన మొహమాటాలూ లేనట్లుగా టాలీవుడ్ లో కొందరు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే సినిమా విడుదల అయితే ఏపీలో జనం కూడా చూస్తేనే హిట్ అవుతుంది. పైగా ఇక్కడ నుంచే ఎక్కువ షేర్ వెళ్తుంది. కానీ పన్నులన్నీ తెలంగాణాకు కడుతూ ఆపద కాలంలో వివక్ష చూపించేలా ఒక వైపే పొగడ్తలతో సొంత స్వార్ధం చూసుకునే కొంతమంది వైఖరి వల్ల ఏపీ మొత్తానికి టాలీవుడ్ చెడిపోతుందేమో ఆలోచించుకుంటే మంచిదని అంటున్నారు. మరి రీల్ హీరోలు ఇకనైనా రియల్ లోకంలోకి వస్తారా అన్నది చూడాలి.