ఇద్దరి మధ్య కొత్త చిచ్చు మొదలయిందా?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉండాలని, ఉభయ ప్రాంతాలను అభివృధ్ధి చేసుకోవాలని అంతా భావిస్తారు. రెండుగా రాష్ట్రం ముక్కలు అయినా అన్నదమ్ములుగా కలసి ఉంటే కలదు [more]

Update: 2020-05-12 13:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉండాలని, ఉభయ ప్రాంతాలను అభివృధ్ధి చేసుకోవాలని అంతా భావిస్తారు. రెండుగా రాష్ట్రం ముక్కలు అయినా అన్నదమ్ములుగా కలసి ఉంటే కలదు లాభమని కూడా అంటారు. అయితే చంద్రబాబు, కేసీఆర్ ల మధ్యన మాత్రం ఆ సాన్నిహిత్యం కుదరలేదు. ఎందుకంటే బాబు పైన కేసీఆర్ కి అనుమానం, కేసీఆర్ అంటే బాబుకు జూనియర్ అన్న భావన ఉండడం వల్ల ఇద్దరి సంబంధాలు బెడిసికొట్టాయి. ఇక జగన్ ఏపీకి సీఎం అయ్యాక బాగా మెరుగు అయ్యాయి. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే ఏకంగా కేసీఆర్ పెద్దగా వచ్చిన్ ఆశీర్వదించారు. ఆనాడు సభలో కూడా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలూ విభేదాలు మరచి ఒక్కటిగా కలసిఉండాలని గట్టిగా కోరుకున్నారు.

దూకుడుగానే ….

ఇక కేసీఆర్, జగన్ ల మధ్యన అనుబంధం మొదట్లో బాగానే సాగింది. వరస సమావేశాలు నిర్వహిస్తూ, తరచూ భేటీలు వేస్తూ ఇద్దరు ముఖ్యమంత్రులూ జాతీయ స్థాయిలోనే కదలిక తెచ్చారు. ఈ ఇద్దరు ముచ్చట్లూ చూసేందుకు రెండు కళ్ళూ చాలలేదు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఇక మరో వైపు అటూ ఇటూ విపక్షాలు సైతం కుళ్ళుకునేలా దోస్తీ కొనసాగింది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులను ఉమ్మడిగా చేపట్టేలా కూడా ఈ బంధం సాగింది. కానీ ఎందుకో గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్యన మాటా మంతీ కరవు అయ్యాయి.

అలా మొదలు…

జగన్ ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అక్కడ కేసీఆర్ కి అదే ఆర్టీసీతో లడాయి ఏర్పడింది. దాంతో కేసీఆర్ అన్న మాటలు, వాడిన పదాలు ఇండైరెక్ట్ గా జగన్ కి తగిలాయి. దానికి మంత్రి పేర్ని నాని ఎటూ కౌంటర్ ఇచ్చారు కానీ జగన్ మాత్రం ఎందుకో కొంత ఎడం పాటిస్తూ వచ్చారు. ఇక పాలనలో దూకుడుగా మొదట్లో జగన్ ఉంటే తరువాత కేసీఆర్ అందుకున్నారు. వరస ఎన్నికల్ల్లో అన్ని సీట్లు టీయారెస్ పరం చేసిన కేసీఆర్ రాజకీయంగా బాగా బలపడ్డారు. ఇపుడు కరోనా వేళ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఏపీని ప్రభావితం చేసేలా ఉన్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కొత్త పోటీగా కూడా ఇది మారుతోంది.

పోతిరెడ్డిపాడుతో…..

ఇపుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కేసీఆర్, జగన్ ల మధ్య కొత్త చిచ్చు రేపేలా ఉంది. వరదల సమయంలో సముద్రం పాలు అవుతున్న గోదారి జలాలను ఒడిసిపట్టి నిల్వ చేసేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఎత్తుని పెంచాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దాని ద్వారా సీమ జిల్లాలకు నీటి కొరత లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. అయితే పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచి కృష్ణా జలాలను లాగేస్తారని, తద్వారా తెలంగాణా జిల్లాలు ఏడారి అవుతాయని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి జి వివేక్ దీని మీద మాట్లాడుతూ, శ్రీశైలం బ్యాక్ వాటర్ ని తరలించుకుపోవడానికి నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు కుట్ర మొదలెట్టారని, ఇపుడు ఆయన తనయుడు జగన్ ఏకంగా ఎత్తు పెంచి మరీ మొత్తానికి మొత్తం నీళ్ళు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీని మీద కేసీయార్ సీరియస్ అయ్యారు. ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్ కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఇది సున్నితమైన అంశమే కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినది కావడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కడా కూడా తగ్గే అవకాశం లేదు. దాంతో ఇద్దరి మధ్యన సరికొత్త యుధ్ధం మొదలు అవడం ఖాయమని అంటున్నారు. చూడాలి.

Tags:    

Similar News