కల్వకుంట్ల లెక్క ఇదేనట
అంతా అనుకున్నట్లే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి వర్గ విస్తరణకు ఈరోజు శ్రీకారం చుట్టేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆరుగురు మంత్రులను తమ క్యాబినెట్ లోకి [more]
అంతా అనుకున్నట్లే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి వర్గ విస్తరణకు ఈరోజు శ్రీకారం చుట్టేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆరుగురు మంత్రులను తమ క్యాబినెట్ లోకి [more]
అంతా అనుకున్నట్లే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి వర్గ విస్తరణకు ఈరోజు శ్రీకారం చుట్టేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆరుగురు మంత్రులను తమ క్యాబినెట్ లోకి తీసుకునేందుకు నిర్ణయం తీసుకుని గవర్నర్ తమిళ సై కి లిస్ట్ పంపించారు. కెసిఆర్ ఇచ్చిన పేర్లలో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాధోడ్, గంగల కమలాకర్ ఉన్నట్లు గులాబీ వర్గాల సమాచారం. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో పార్టీలో జోష్ పెంచేందుకు గులాబీ బాస్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. ఒక పక్క కమలదళం తెలంగాణ లో జోష్ పెంచిన నేపథ్యంలో వారి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్రణాళికతోనే ఈ టీం ను చేర్చుకున్నట్లు తెలుస్తుంది.
నేపథ్యం ఇదే …
కారు జోరు పెరగాలంటే గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మంత్రి వర్గంలోకి రావాలన్న డిమాండ్ పార్టీ వర్గాల్లో ఇటీవల బాగా పెరిగింది. అదే విధంగా గులాబీ పార్టీ మౌత్ స్పీకర్ హరీష్ ను పక్కన పెట్టి ఉద్యమ నేతకు అన్యాయం చేశారని ఆయన పార్టీకి దూరం అవుతూ మరో వర్గం తయారు చేస్తున్నారంటూ సాగిన ప్రచారానికి చెక్ పెట్టేందుకు కెసిఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లా నుంచి గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్యెల్యే పువ్వాడ అజయ్ కుమార్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అజయ్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అటు జిల్లాకు ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసే సంకేతాలు అధినేత పంపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ గా వలసలు రావడానికి కారకురాలైన సబితా ఇంద్రా రెడ్డి కి మంత్రి పదవి అందరు ఊహించిందే. ఆమె తో పాటు సత్యవతి రాధోడ్ కి మంత్రి వర్గంలోకి తీసుకుని మహిళలకు చోటు ఇవ్వలేదన్న అపవాదును చెరిపేసుకునే ప్రయత్నం చేశారు గులాబీ బాస్.