కేసీఆర్ మనసు మారింది
కేసీఆర్ రాజకీయంగా చూస్తే అపర మేధావి. చాణక్యుడు. ఎక్కడ తగ్గాలో, ఎలా నెగ్గాలో తెలిసిన నాయకుడు. బీజేపీ మంచి ఫామ్ లో ఉన్నపుడు సైలెంట్ గా ఉన్న [more]
కేసీఆర్ రాజకీయంగా చూస్తే అపర మేధావి. చాణక్యుడు. ఎక్కడ తగ్గాలో, ఎలా నెగ్గాలో తెలిసిన నాయకుడు. బీజేపీ మంచి ఫామ్ లో ఉన్నపుడు సైలెంట్ గా ఉన్న [more]
కేసీఆర్ రాజకీయంగా చూస్తే అపర మేధావి. చాణక్యుడు. ఎక్కడ తగ్గాలో, ఎలా నెగ్గాలో తెలిసిన నాయకుడు. బీజేపీ మంచి ఫామ్ లో ఉన్నపుడు సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్ ఇపుడు మెల్లగా జూలు విదిలిస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా ఫలితాల తరువాత కేసీఆర్ జోరు పెరిగింది. కేంద్రం ఏం చేసిందని ఈ మధ్యనే నిండు అసెంబ్లీలో గట్టిగా గర్జించిన కేసీఆర్ కుమారుడు కేటీయార్ తోడు అయ్యాడు. అభివృధ్ధి అంతా ఉత్తరాదికేనా అంటూ కేటీయార్ ఇటీవల ఓ సభలో నిలదీసిన తీరు కూడా కాషాయ దళానికి ఖంగు తినిపించేదే. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా తన రాజకీయ తెలివిడిని కేసీఆర్మరో మారు చాటుకున్నారు.
అందరికీ ఒకేచోట ….
ఈ రోజు దేశంలో చూసుకుంటే జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు మంచి రోజులు మళ్ళీ వస్తున్నట్లే కనిపిస్తోంది. జార్ఖండ్ లో బీజేపీకి షాక్ ఇచ్చింది ఒక ప్రాంతీయ పార్టీ. మహారాష్ట్రలో శివసేన కూడా అంతే. ఇక హర్యానాలో ఒక ప్రాంతీయ పార్టీతో జట్టు కట్టకపోతే బీజేపీకి అధికారం దక్కదన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలో మళ్ళీ జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు పడిందని అంటున్నారు. హైదరాబాద్ లో అన్ని బీజేపీయేతర పార్టీలను పిలిచి ఒక సమావేశం నిర్వహించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ముందు చూపుతోనే…?
దేశంలో ఇపుడు మోడీ హవా తగ్గుతోంది. కాంగ్రెస్ పెద్దగా పుంజుకోవడంలేదు. ప్రాంతీయ శక్తులు కనుక గట్టిగా నిలబడితే కాంగ్రెస్ మద్దతుతో మరో మారు కేంద్రంలో అధికారంలోకి రావచ్చు. ఇది 2024 నాటికి ఒక ముందస్తు ప్రణాళీకగా ఉంది. ఈ రకమైన ఆలోచనలతోనే కేసీఆర్ ప్రాంతీయ శక్తులతో కలవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎటూ బీజేపీ ఇపుడు బలం తగ్గి ఉంది కాబట్టి బయటకు వచ్చి అంతా చేతులు కలిపే అవకాశాలు ఉంటాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంటేనా :
మమతా బెనర్జీ ముస్లిం మైనారిటీ వర్గాలకు మిత్రురాలిగా దూసుకుపోతున్నారు. ఆమె బాటలో తెలంగాణాలో కూడా గట్టిగా దూకుడు చూపాలని కేసీఆర్ అనుకుంటున్నారట. ఆయనకు మజ్లీస్ నుంచి సహజ మిత్రునిగా అసదుద్దీన్ ఉన్నారు. ఈ జంట దేశంలోని మిగిలిన బీజేపీ వ్యతిరేక శక్తులను పోగు చేస్తారని అంటున్నారు. మరో మారు ఫెడరల్ ఫ్రంట్ ప్రయోగం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లే ఉంది. ఏపీ నుంచి చూస్తే మిత్రుడుగా జగన్ ఉన్నారు. అయితే ఆయన బీజేపీ తోనూ టచ్ లో ఉన్నారు. అందువల్ల కేసీఆర్ తో ఈ విషయంలో చేతులు కలుపుతారా అన్నది ఒక చర్చగా ఉంది. జగన్ కాక దేశంలోని ఇతర పార్టీల విషయంలో కేసీఆర్ పిలుపులు ఎవరికి వెళ్తాయో చూడాలి.