కేకే కు ఇక కష్టమే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగించి ఆయన జాతీయ రాజకీయాల వైపు వెళతారన్న టాక్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగించి ఆయన జాతీయ రాజకీయాల వైపు వెళతారన్న టాక్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగించి ఆయన జాతీయ రాజకీయాల వైపు వెళతారన్న టాక్ గులాబీ పార్టీలో నడుస్తుంది. దీంతో పాటు కుమార్తె కవితను కూడా రాజ్యసభ సభ్యురాలిగా చేయాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయారంటున్నారు. త్వరలోనే తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో ఒకటి కవితకు కేసీఆర్ రిజర్వ్ చేశారంటున్నారు.
రెండు స్థానాల నుంచి…..
అయితే రాజ్యసభకు ఖాళీ అయ్యే ఈ రెండు స్థానాల నుంచి కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ జరుగుతోంది. సీనియర్ నేత కె.కేశవరావును కేసీఆర్ ఈ దఫా పక్కన పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే కె.కేశవరావును రెండు సార్లు రాజ్యసభకు ఎంపిక చేశారు. మరోసారి రెన్యువల్ చేయడానికి కేసీఆర్ సుముఖంగా లేరంటున్నారు. పైగా కుమారుడికి పార్టీ బాధ్యతలతో పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకుంటుండటంతో సీనియర్ నేత కేకేను తప్పించాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది.
కవితకు రిజర్వ్…..
అలాగే ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా కె.కేశవరావు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట. తాను మధ్యవర్తిత్వం వహిస్తాననడం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. దీంతో కేకేను పూర్తిగా తప్పించి ఆ స్థానంలో కవితకు అవకాశమివ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఓటమి పాలయిన తర్వాత కవిత పూర్తిగా పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.
కేకే స్థానంలో…..
కవితను యాక్టివ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసమే కవితను రీఎంట్రీ చేయాలన్న నిర్ణయానికి రావడంతో కేకేను తప్పించినట్లేనన్న వ్యాఖ్యలు పార్టీలో బలంగా విన్పిస్తున్నాయి. కేకే స్థానంలో మరో బలహీన వర్గాల నేతను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. మాజీ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ పేరు కూడా బలంగా విన్పిస్తుంది. కుమార్తె కవిత కోసం తప్పించారన్న పేరు రాకుండా తగిన జాగ్రత్తలు కేసీఆర్ తీసుకుంటున్నారంటున్నారు. కేకే ను తప్పించడం ఖాయమట. అలాగే కవితకు కూడా చోటు కల్పంచడం ఖరారయిందంటున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు.