అందుకే కేసీఆర్ అంటే అంత ఇష్టం
“నేను తెలంగాణలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. పుట్టిన రాష్ట్రంలో ఎందుకు ఉండటం లేదని రోజూ మదనపడే వాడిని. కానీ ఇప్పుుడ కేసీఆర్ పనితీరు చూసిన తర్వాత తెలంగాణలో [more]
“నేను తెలంగాణలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. పుట్టిన రాష్ట్రంలో ఎందుకు ఉండటం లేదని రోజూ మదనపడే వాడిని. కానీ ఇప్పుుడ కేసీఆర్ పనితీరు చూసిన తర్వాత తెలంగాణలో [more]
“నేను తెలంగాణలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. పుట్టిన రాష్ట్రంలో ఎందుకు ఉండటం లేదని రోజూ మదనపడే వాడిని. కానీ ఇప్పుుడ కేసీఆర్ పనితీరు చూసిన తర్వాత తెలంగాణలో సెటిల్ అవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా” ఇప్పుడు సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ సెటిలర్ల నుంచి విన్పిస్తున్న వ్యాఖ్యలు. కరోనా వైరస్ ను అరికట్టడంలోనూ, తీసుకుంటున్న చర్యలపైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పార్టీలకతతీతంగా ప్రశంసిస్తున్నారు.
ప్రగతి భవన్ కే పరిమితమై….
ఆయన ముఖ్యమంత్రిగా ప్రగతి భవన్ కే పరిమితమయ్యారంటారు. ముఖ్యమంత్రిగా సచివాలయం గడపతొక్కలేదన్న విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. కానీ సరైన సమయంలో స్పీడ్ పెంచే నేతగా కేసీఆర్ ఇప్పుడు అందరూ మనసులను గెలుచుకుంటున్నారు. నిజంగానే కేసీఆర్ ముఖ్యమంత్రిగా టెన్షన్ పడరని అంటారు. ఆయన పదవిని ఎంజాయ్ చేస్తారని ఆయన సన్నిహితులెవరైనా ఇట్టే చెబుతారు. సమయం దొరక్కపోయినా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి సేద తీరడం అనేక సార్లు విమర్శలకు తావిచ్చింది.
టెన్షన్ పడుతూనే….
అయితే కేసీఆర్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆయన నిరంతరం సమీక్షలతోనే గడుపుతున్నారు. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల కొకసారి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి మొదలయిన వెంటనే కేసీఆర్ ముందస్తు చర్యలు ప్రారంభించారు. జనతా కర్ఫ్యూ కు ముందే ఆయన ముందస్తు చర్యలకు దిగారు.
అన్నింటా ప్రశంసలే…..
విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించడంతో పాటు వారిని క్వారంటైన్ కు తరలించడాన్ని పకడ్బందీగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అలాగే దుకాణాల బంద్, లాక్ డౌన్ విషయంలో కూడా కేసీఆర్ కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. దీనితో పాటు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీనివల్లనే తెలంగాణలో ప్రజలు కూడా బయటకు రావడానికే భయపడుతున్నారు. ప్రజాప్రతినిధులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు సయితం కేసీఆర్ పాలన భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు.