కేసీఆర్ కంటిన్యూ చేసేటట్లే కనపడుతుందే?

లాక్ డౌన్ అంశంలో కేంద్రం ఒక అడుగు వేస్తే కేసీఆర్ మరో రెండు అడుగులు వేస్తున్నారు. ఆదివారంతో లాక్ డౌన్ ముగుస్తుంది అనుకుంటున్న దశలో మే 17 [more]

Update: 2020-05-03 11:00 GMT

లాక్ డౌన్ అంశంలో కేంద్రం ఒక అడుగు వేస్తే కేసీఆర్ మరో రెండు అడుగులు వేస్తున్నారు. ఆదివారంతో లాక్ డౌన్ ముగుస్తుంది అనుకుంటున్న దశలో మే 17 వరకు కేంద్రం పొడిగించేసింది. ఇక మే 7 వ తేదీ వరకు తెలంగాణ లో లాక్ డౌన్ గతంలో నిర్ణయించిన పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించారు కేసీఆర్ . తాజాగా కేంద్రం పొడిగింపుకే మొగ్గు చూపింది. అయితే కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు ఆ మినహాయింపులను కేసీఆర్ అంగీకరించి అమలు చేస్తారా ? లేక తన వ్యూహం ప్రకారమే ముందుకు వెళతారా అన్నది ఆసక్తికరం గా మారింది.

కఠినంగానే ఉంటారా …?

ప్రస్తుతం ఎపి తో పోలిస్తే తెలంగాణ వైరస్ కట్టడిలో ముందే ఉంది. అయితే టెస్ట్ లలో ఎపి నెంబర్ వన్ లో ఉంటె తెలంగాణ లో మాత్రం టెస్ట్ ల సంఖ్య తక్కువ ఉండటం తో విపక్షాల విమర్శలు సైతం తీవ్రంగానే ఉన్నాయి. కానీ పాజిటివ్ కేసుల సంఖ్య బాగానే తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరికొంత కాలం కఠిన వైఖరి అనుసరించకతప్పదన్న వ్యూహమే అమలు చేస్తారని తేలిపోతుంది. వైరస్ అంశం చుట్టుముట్టిన నుంచి ఎపి తెలంగాణ సర్కార్ లు భిన్నమైన రూట్ లోనే వెళుతున్నాయి. దాంతో ఇద్దరి ముఖ్యమంత్రుల నిర్ణయాలపై విస్తృత చర్చ నడుస్తుంది. ఇక కేసీఆర్ ఒకరకంగా వైరస్ పై ఏమి చేయాలి అనేదానిపై కేంద్ర సర్కార్ కి పరోక్ష సంకేతాలు ఇచ్చేస్తున్నారు.

వదిలితే హైదరాబాద్ ఇంతే సంగతులా …?

తెలంగాణ ఆదాయానికి హైదరాబాద్ ఆయువు పట్టు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైరస్ కట్టడి కేసీఆర్ కి ఒక పెద్ద సవాల్. మెగా సిటీస్ గా ఉన్న ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ వంటి చోట కేసులు సంఖ్య విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం లో ఏ మాత్రం లాక్ డౌన్ వీక్ చేసినా కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదన్నది కేసీఆర్ భయంగా కనిపిస్తుంది. అందుకే ఈనెల 5 న జరిగే క్యాబినెట్ సమావేశం తరువాత ఆయన చేయబోయే ప్రకటన పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మానసికంగా కేసీఆర్ అన్ని రకాలుగా ప్రజలను సిద్ధం చేసేశఆరు. జనాభా సాంద్రత కూడా హైదరాబాద్ లో చాలా ఎక్కువ ఏ చిన్నపాటి మినహాయింపు ఇచ్చినా వైరస్ వ్యాప్తి దారుణంగా ఉంటుందన్న అంచనాలు ఇప్పటికే కేసీఆర్ ముందు అధికారగణం పెట్టినట్లు తెలుస్తుంది. దాంతో టి బాస్ కేంద్రం ఇచ్చిన మినహాయింపులు అన్ని ఉపయోగించుకోకపోవచ్చనే అంటున్నారు. మే 17 తరువాత కూడా నెలాఖరు వరకు పరిస్థితి ఎలా ఉన్నా లాక్ డౌన్ ను కేసీఆర్ కొనసాగిస్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News