ఫీడ్ బ్యాక్ ను బట్టే లాక్ డౌన్ పై?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయాలను తీసుకుంటామని తరచూ చెబుతుంటారు. ఏ విషయంలోనైనా ఆయన సర్వేల మీదనే ఆధారపడతారు. ఎన్నికల సమయంలోనూ నాలుగైదు సర్వేలు చేయించిన [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయాలను తీసుకుంటామని తరచూ చెబుతుంటారు. ఏ విషయంలోనైనా ఆయన సర్వేల మీదనే ఆధారపడతారు. ఎన్నికల సమయంలోనూ నాలుగైదు సర్వేలు చేయించిన [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయాలను తీసుకుంటామని తరచూ చెబుతుంటారు. ఏ విషయంలోనైనా ఆయన సర్వేల మీదనే ఆధారపడతారు. ఎన్నికల సమయంలోనూ నాలుగైదు సర్వేలు చేయించిన అనంతరమే అభ్యర్థుల ఎంపిక చేయడం కేసీఆర్ గత కొన్ని దఫాలుగా అనుసరిస్తున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై కూడా తాను సర్వే చేసినట్లు గతంలో కేసీఆర్ చెప్పారు. మరోసారి లాక్ డౌన్ కొనసాగింపు, ఎత్తివేతపై కేసీఆర్ సర్వే చేయించినట్లు చెబుతున్నారు.
మే 7వ తేదీ వరకూ…..
తెలంగాణలో మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు గతంలోనే ప్రకటించారు. అదే సమావేశంలో ప్రజలు కూడా లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరుకుంటున్నారని తాను చేయించిన సర్వేలో తేలినట్లు ఆయన మీడియా మీట్ లో చెప్పారు. ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపు, ఎత్తి వేతలపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కొద్దికాలం పాటు లాక్ డౌన్ ను కొనసాగించడానికే కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మరో నాలుగురోజులు ఎక్కువే….
గతంలో మే 3వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటిస్తే, కేసీఆర్ ఒక నాలుగు రోజులు అదనంగా మే 7వతేదీ వరకూ ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే లెక్కలో మే 21వ తేదీ వరకూ లాక్ డౌన్ ను తెలంగాణలో విధించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అధికారుల సమీక్షలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మినహాయింపుల విషయంలో…..
అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు వాడుకోవాలని కొందరు సూచించినట్లు తెలిసింది. కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో మినహాయింపులు ఇస్తే రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మంత్రివర్గ సమావేశంలో వేటికి? ఎక్కడ? మినహాయింపులు ఇవ్వాలన్న దానిపై క్లారిటీ రానుంది. మే 8వ తేదీ నుంచి తెలంగాణలో కొన్ని మినహాయింపులు ఇచ్చి లాక్ డౌన్ ను మాత్రం మే 21వరకూ కంటిన్యూ చేయాలన్న ఉద్దేశ్యంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.