మరోసారి పొడిగించడమే… తప్పేట్లు లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై [more]

Update: 2020-05-26 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న పలువురిని కేసీఆర్ సంప్రదించారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఐదో విడత లాక్ డౌన్ ను కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

మినహాయింపుల తర్వాత…..

మూడు, నాల్గో విడత లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీనిపై కేసీఆర్ కు అధికారులు నివేదిక అందించారు. ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రెండువేలకు చేరువలో ఉన్నాయి. దీంతో లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో ఎత్తివేయడం మంచిది కాదని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. లాక్ డౌన్ ను మరో పదిహేను రోజులు పొడిగిస్తే బెటరని అధికారులు తెలిపినట్లు సమాచారం.

దడపుట్టిస్తున్న హైదరాబాద్….

ప్రధానంగా హైదరాబాద్ లో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు యాభై నుంచి అరవై కేసులు వస్తుండటం ఆందోళన కల్గించే అంశమే. అందుకే లాక్ డౌన్ పొడిగింపుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. మిగిలిన జిల్లాల్లో కరోనా వైరస్ ఉధృతి చాలా వరకూ తగ్గింది. ఒక్క హైదరాబాద్ ను మాత్రం వదలడం లేదు. దీంతో హైదరాబాద్ లో కఠినంగా లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ప్రజా రవాణాపై కూడా…..

ఇప్పటికే జిల్లా స్థాయిలో ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చారు. ప్రజారవాణా ప్రారంభం అయిన తర్వాత కేసులు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ పెద్దగా పెరగలేదు. దీంతో అంతర్ రాష్ట్ర సర్వీసులకు కూడా అనుమతిచ్చే ఆలోచనను కేసీఆర్ చేస్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్ర, తమిళనాడు తప్పించి మిగిలిన రాష్ట్రాలకు బస్సులు తిప్పడంపై ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఐదో విడత లాక్ డౌన్ ను కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించిన తర్వాత నిర్ణయాన్ని కేసీఆర్ వెలువరించనున్నారు.

Tags:    

Similar News