టచ్ చేయకుండానే షాక్ ఇచ్చారుగా

కేసీఆర్ వ్యూహాలే వేరు. ఆయన ఒక్కొక్క వ్యూహం ప్రతిపక్ష పార్టీలను గుక్కతిప్పుకోనివ్వకోకుండా చేస్తుంది. నోట మాట రాకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కక్కలేక మింగలేక అల్లాడి పోతున్నారు. [more]

Update: 2020-06-29 09:30 GMT

కేసీఆర్ వ్యూహాలే వేరు. ఆయన ఒక్కొక్క వ్యూహం ప్రతిపక్ష పార్టీలను గుక్కతిప్పుకోనివ్వకోకుండా చేస్తుంది. నోట మాట రాకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కక్కలేక మింగలేక అల్లాడి పోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే ఎప్పటికైనా తనకు శత్రువని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీ అక్కడక్కడా బలాన్ని ప్రదర్శిస్తున్నా అది పూర్తి స్థాయిలో కోలుకోదన్నది కేసీఆర్ విశ్వాసం. అందుకే కాంగ్రెస్ ను ఏ చిన్న అవకాశం వచ్చినా కేసీఆర్ వదలరు.

పీవీ శత జయంతి ఉత్సవాలను…..

ిఇందుకు పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కారణమని చెప్పక తప్పదు. పీవీ శతజయంతి ఉత్సవాల పేరిట కేసీఆర్ వేసిన చక్రబంధంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పట్టించుకోలేదు. పీవీ మృతి చెందినప్పుడుకూడా ఇతర నాయకులకు ఇచ్చిన గౌరవం ఇవ్వలేదు. చివరకు ఆయన మరణించినప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మరిచిపోరు.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి…..

ఈ నేపథ్యంలో పీవీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును ప్రశ్నించలేని పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్ నేతలది. ఆయన పేరును ఉచ్ఛరించేందుకు కూడా నేతలు భయపడతారు. కనీసం పీవీ స్మృతి పథాన్ని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయలేదు. గాంధీ భవన్ లోనూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించే ధైర్యం చేయని కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ టచ్ చేయకుండానే షాక్ ఇచ్చారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం.

పది కోట్ల రూపాయలు……

ఇందుకోసం కేసీఆర్ ప్రత్యేక కమిటీ వేశారు. పదికోట్ల రూపాయలను ఇందుకోసం కేటాయించారు. దీంతో పాటు పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వంగరలో మెమోరియల్ ట్రస్ట్ ను కూడా నిర్మించనున్నారు. ఇప్పుడు కేసీఆర్ వేసిన స్టెప్ తో కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడటం లేదు. అవుననలేరు. కాదనలేరు. ఇలా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేశాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News