బ్రేకింగ్ : కార్మికులకు కేసీఆర్ డెడ్ లైన్

తాను అమితంగా తెలంగాణ ప్రజలను ఇష్టపడతానని కేసీఆర్ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేబినెట్ [more]

Update: 2019-11-02 15:15 GMT

తాను అమితంగా తెలంగాణ ప్రజలను ఇష్టపడతానని కేసీఆర్ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ ను కూడా భేషజాలకు పోకుండా తగ్గించుకోవడం జరిగిందన్నారు. ఆర్థికమాంద్యం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. 5,100 ప్రయివేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఆర్టీసీ కార్మికులు అంతులేని కోర్కెలు, అనాలోచిత సమ్మె కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

బ్లాక్ మెయిల్ కు తలొగ్గేది లేదు…..

బ్లాక్ మెయిల్ విధానం ఉండకూడదని, రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తిన కూడదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆర్టీసీలో ఉన్న 10,400లో 2400 బస్సులు ప్రయివేటు బస్సులని, ఇందులో 2800 బస్సులు పనికిరానివని చెప్పారు. సమ్మెకు వెళ్లవద్దని చెప్పినా వినకుండా కార్మికులు వెళ్లారన్నారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే సమ్మెకు మధ్యలో వెళ్లారు. ఒకసారి చట్ట వ్యతిరేక సమ్మె డిక్లేర్ అయితే కఠినమైన చట్టం అమలవుతుందన్నారు. ఆ చట్టం అమలయితే యాజమాన్యానికి, కార్మికులకు మధ్య సంబంధాలుండవన్నారు. 49వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు.

నవంబరు 5వ తేదీలోపు….

అసలే కుదేలైపోయిన సంస్థను ఆసరాగా నిలబడాల్సిన కార్మికులు పనికి మాలిన సమ్మెకు దిగి వచ్చిందన్నారు. ఎవరూ ఎవరినీ భవిష్యత్తులో బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండకూడదన్నారు. ఆర్టీసీ ఉంటుందని, అదే సమయంలో ప్రయివేటు బస్సులు కూడా ఉంటాయన్నారు. నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెంచామన్నారు. ఎవరి కడుపు కొట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు. కార్మికులకు ఆర్టీసీతో సంబంధం లేకపోయినప్పటికీ కార్మికులు తమ బిడ్డలుగానే భావిస్తున్నామన్నారు. యూనియన్ల మాయలో పడి ఆగం కావద్దన్నారు. ఆర్టీసీ కార్మికులకు నవంబరు 5వ తేదీలోపు బేషరతుగా విధుల్లో జాయిన్ అవ్వవచ్చని విధించారు. తర్వాత విధుల్లో చేరాలని వచ్చినా చేర్చుకోరన్నారు. మొండికేస్తే మిగిలిన రూట్లను కూడా ప్రయివేటు పరం చేస్తామన్నారు. ప్రయివేటు బస్సులు కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయన్నారు. ఛార్జీలు కూడా ఇష్టం వచ్చినట్లు పెంచడానికి ఉండదన్నారు. పాస్ లన్నీ ప్రయివేటు బస్సుల్లో చెల్లుతాయన్నారు. ఆరోగ్య కరమైన పోటీ మాత్రమే ఉంటుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దాదాపు ఐదు గంటల పాటు మంత్రి వర్గ సమావేశం జరిగింది. 49 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులకు ఒక శాతం డీఎ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News