టీఆర్ఎస్ లో నాలుగో పవర్ సెంటర్ …?
కల్వకుంట్ల కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కుమార్తె. కవిత తాజాగా ఎమ్యెల్సీ గా ఎన్నిక కావడంతో ఆ పార్టీలో మరో పవర్ సెంటర్ మరోసారి రీఓపెన్ [more]
కల్వకుంట్ల కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కుమార్తె. కవిత తాజాగా ఎమ్యెల్సీ గా ఎన్నిక కావడంతో ఆ పార్టీలో మరో పవర్ సెంటర్ మరోసారి రీఓపెన్ [more]
కల్వకుంట్ల కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కుమార్తె. కవిత తాజాగా ఎమ్యెల్సీ గా ఎన్నిక కావడంతో ఆ పార్టీలో మరో పవర్ సెంటర్ మరోసారి రీఓపెన్ అయినట్లే అని గులాబీదళంలో గుసగుసలు బయలుదేరాయి. ఇప్పటికే కేసీఆర్ ప్రధాన కేంద్రంగా ఒకటి కేటీఆర్ కేంద్రంగా మరొకటి, హరీష్ రావు నేతృత్వంలో మరో పవర్ సెంటర్స్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు కవిత కు అధికారికంగా పదవి లభించడంతో ఆమె మరోసారి పార్టీలో కీలకంగా మారతారని టాక్.
తెలంగాణ ఉద్యమం నుంచి…..
తెలంగాణ ఉద్యమం నుంచి కవిత జోరుగానే పనిచేశారు. ఆ తరువాత పార్లమెంట్ సభ్యురాలిగా సేవలు అందించారు. వాస్తవానికి కవితను జాతీయ రాజకీయల వైపు కెసిఆర్ మళ్లించారు. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఆమె పరాజయం తో బాటు రాష్ట్ర రాజకీయాల వైపే ఆమె మక్కువ చూపడంతో కుమార్తె అభీష్టాన్ని తండ్రి మన్నించి స్థానిక సంస్థల నుంచి ఎమ్యెల్సీ కోటా లో సీటు ఇచ్చి గెలిపించారు.
జాతీయ రాజకీయాల వైపు కెసిఆర్ …
గులాబీ పార్టీ ప్రస్తుతం ఢిల్లీ వేదికగా పార్టీ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తుంది. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి చురుకైన పాత్ర పోషించాలని ఎప్పటినుంచో గులాబీ బాస్ కలలు కంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ఈ విషయాన్నీ ఆయన ప్రకటించారు కూడా. అయితే బిజెపి కి పూర్తి మెజారిటీ రావడంతో కెసిఆర్ దూకుడు తగ్గించాలిసిన పరిస్థితి ఏర్పడింది. అయితే రానున్న రోజుల్లో సంకీర్ణ రాజకీయ యుగం మళ్ళీ మొలకెత్తుతుందని కెసిఆర్ భావిస్తున్నారు.
అందుకే అలా…?
అందుకే ఇప్పటినుంచి దానికి అనుగుణంగా పావులు కదిపేందుకు సిద్ధమై కొడుకు, కూతురు, మేనల్లుడిలపై రాష్ట్ర పార్టీ వ్యవహారాలు మోపేందుకు డిసైడ్ అయ్యారని అందుకే కవిత కు అధికారిక పదవిలో కూర్చోబెడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రేపో మాపో కెటిఆర్ సిఎం అయిపోతారంటూ పెద్దఎత్తునే ఎప్పటినుంచో ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోదరుడికి సహకారంగా సోదరి పవర్ సెంటర్ స్టార్ట్ చేస్తే పార్టీ కి మేలన్నది గులాబీ బాస్ వ్యూహం అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.