వాళ్లంతా దూరమవుతున్నారా?

ఆరేళ్ల పరిపాలన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో కొంత అసంతృప్తి మొదలయిందనే చెప్పాలి. బలహీన మైన విపక్షాలతో ఇన్నాళ్లూ నెట్టుకొస్తున్న కేసీఆర్ కు రానున్న కాలం కష్టకాలమనే [more]

Update: 2020-11-15 11:00 GMT

ఆరేళ్ల పరిపాలన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో కొంత అసంతృప్తి మొదలయిందనే చెప్పాలి. బలహీన మైన విపక్షాలతో ఇన్నాళ్లూ నెట్టుకొస్తున్న కేసీఆర్ కు రానున్న కాలం కష్టకాలమనే చెప్పాలి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ వ్యతిరేక వర్గం అంతా ఒక్కటై ఆయనను ఢీకొనే అవకాశాలున్నాయి. దీంతో పాటు బీజేపీ కూడా తెలంగాణలో బలపడుతుండటం కేసీఆర్ పార్టీకి ఆందోళన కల్గించే అంశం.

బీజేపీ స్ట్రాంగ్ అవుతూ…..

బీజేపీని అంత తేలిగ్గా తీసుకోకూడదు. అనేక రాష్ట్రాల్లో మొదట రెండింటితో మొదలై చివరకు అధికారంలోకి వచ్చిన చరిత్ర బీజేపీకి ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న బలం, కమిట్ మెంట్ ఉన్న క్యాడర్ బీజేపీ స్ట్రెంగ్త్ అని చెప్పకతప్పదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం వచ్చినా లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి నాలుగు స్థానాలను బీజేపీ చేజిక్కించుకుంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల నుంచే కేసీఆర్ కు బీజేపీ బెంగ పట్టుకుంది.

ఆ సామాజికవర్గాలు…..

మరోవైపు తెలంగాణలో బలమైన సామాజికవర్గం కేసీఆర్ కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మొన్నటి వరకూ ఆధిపత్యం వహించిన ఆ సామాజికవర్గం గత ఆరేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉంటోంది. దీంతో కేసీఆర్ ఈ సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. దీంతో పాటు ఆర్థికంగా బలమైన మరో సామాజికవర్గం సయితం బీజేపీకి చేరువయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

ఈక్వేషన్లలో తేడా వచ్చే….

ఇప్పటి వరకూ కమ్మ, రెడ్డి, వెలమ ఈక్వేషన్లతో ముందుకు వెళుతున్న కేసీఆర్ కు రానున్న కాలంలో ఆ రెండు సామాజికవర్గాలు దూరమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపు, కమ్మ సామాజికవర్గం బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలుండటం కేసీఆర్ ను ఆందోళనలో పడేసిందంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో కేసీఆర్ వ్యూహాలు వాటిని అధిగమిస్తాయని పార్టీ నేతలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మొత్తం మీద కేసీఆర్ కు క్రమంగా కొన్ని వర్గాలు దూరమవుతున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News