గులాబీ బాస్ భయపడ్డారా? అందుకనే అలా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు ముందు వెళ్లాలనుకోవడంపై చర్చ జరుగుతుంది. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలను [more]

Update: 2020-11-20 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు ముందు వెళ్లాలనుకోవడంపై చర్చ జరుగుతుంది. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలను జనవరి నెలలో నిర్వహిస్తే బాగుంటుందని అనుకున్నారు. హైదరాబాద్ లో వరద సాయంపై అసంతృప్తులు తలెత్తడం, మంత్రులు, కార్పొరేటర్లపై ప్రజలు తిరగబడటంతో గ్రేటర్ ఎన్నికలను జనవరికి వాయిదా వేయాలని కేసీఆర్ భావించారు.

ముందుగానే….

కానీ డిసెంబరు 1వ తేదీన ఎన్నికలకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ ఎన్నికలను జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కమిషన్ కు కూడా తమకు ముందుగా జరిపితే అభ్యంతరం లేదని తెలపడంతో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ముందుగానే జరుగుతున్నాయి. నిజానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ హైదారాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయాల్సి ఉంది.

బీజేపీ బలపడుతుందనే….

అయితే ఇవేమీ జరగకుండానే కేసీఆర్ ఎన్నికలకు ఓకే చెప్పారు. దీని వెనక బలమైన కారణం ఉందంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఊపు మీద ఉంది. దానికి ఎక్కువ సమయం ఇవ్వకూడదనే తక్కువ సమయంలోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని కేసీఆర్ భావించారట. సమయం ఎక్కువ ఇస్తే బీజేపీ బలపడే అవకాశముందని భావించిన కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలను అనుకున్న దానికంటే ముందుగానే జరిపేందుకు నిర్ణయించారు.

సమయం ఇవ్వకుండా…..?

ఇప్పుడు బీజేపీకి పెద్దగా సమయం లేదు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ బీజేపీ వెనకబడే అవకాశాలుంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో దుబ్బాక ఎన్నికల మాదిరిగా ప్రచారం చేసే సమయమూ కేసీఆర్ బీజేపీకి ఇవ్వలేదు. అందుకనే ఇష్టంలేకపోయినా, కష్టమని భావిస్తున్న సమయంలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. మరి ఏ మేరకు గులాబీ పార్టీకి లాభిస్తుందో చూడాలి.

Tags:    

Similar News