పూర్తి ప్రక్షాళన దిశగా గులాబీ బాస్
త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల టీమ్ ను ఆయన రెడీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం [more]
త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల టీమ్ ను ఆయన రెడీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం [more]
త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల టీమ్ ను ఆయన రెడీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ మొన్న జరిగిన అవమానంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి మాత్రమే కేసీఆర్ విస్తరణ చేపట్టారు. తొలి దఫాలో కొద్దిమందిని కేబినెట్ లో తీసుకున్న కేసీఆర్ ఆ తర్వాత మరికొందరిని తీసుకున్నారు.
రెండేళ్లు పూర్తయి……
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ చేయాలని ఆయన గట్టిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో నుంచి కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. సామాజిక వర్గాల సమీకరణలతో పాటు ఈసారి సీనియర్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటములు చవి చూసిన తర్వాత….
ప్రధానంగా దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా విజయాలు రావడం ఆయనను ఈ ఆలోచనలో పడేశాయంటున్నారు. ఈ రెండేళ్లలో కొందరు మంత్రుల పనితీరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో మంత్రుల పెరఫార్మెన్స్ ను కూడా కేసీఆర్ లెక్కలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కొందరికి ఉద్వాసన….?
తొలుత మంత్రివర్గంలోకి కేసీఆర్ తన కుమార్తె కవితను తీసుకోవాలని భావించినా, కుటుంబ పార్టీ అని ప్రత్యర్థి పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో ఆమె పేరును పక్కన పెట్టారని చెబుతున్నారు. దీంతో పాటు ఒక మహిళ మంత్రిని కూడా మంత్రివర్గం నుంచి తొలగించాలని డిసైడ్ అయ్యారంటున్నారు. కొత్తవారికి, పార్టీలో తొలి నుంచి ఉన్న వారికి ఈ సారి మంత్రివర్గ విస్తరణలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చన్న ఊహాగానాలు గులాబీ పార్టీ నుంచి విన్పిస్తున్నాయి.