ఢిల్లీ అంతగా మార్చేసిందా? కారణమిదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే ఒకటి మాత్రం నిజం అనిపిస్తుంది. ఆయన బీజేపీకి తలవంచాడనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ కమలం పార్టీపై కత్తులు దూసిన [more]

Update: 2021-01-08 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే ఒకటి మాత్రం నిజం అనిపిస్తుంది. ఆయన బీజేపీకి తలవంచాడనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ కమలం పార్టీపై కత్తులు దూసిన కేసీఆర్ ఒక్కసారిగా ఆ పార్టీ పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన కేసీఆర్ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. నాడు వద్దన్న కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇప్పుడు కేసీఆర్ కావాలంటున్నారు. ఇదంతా కేసీఆర్ ఢిల్లీ యాత్ర తర్వాతే జరుగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

థర్డ్ ఫ్రంట్ పెడతానంటూ……

దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా కేసీఆర్ డీలా పడలేదు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రాకపోవడం, బీజేపీ పుంజుకోవడంతో కేసీఆర్ ఒకింత కంగుతిన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తాను థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని, ఇకపై హస్తినకు వెళ్లి రాజకీయం చేస్తానని చెప్పిన కేసీఆర్ పూర్తిగా రివర్స్ లో వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. హస్తినలో ప్రధాని మోది, హోం మంత్రి అమిత్ షాలను కలసిన తర్వాత ఏం జరిగిందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

అన్ని నిర్ణయాలను వెనక్కు…..

అంతకు ముందు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. రైతు సంఘాలు ఇచ్చిన బంద్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు సయితం పాల్గొన్నారు. అయితే హస్తిన వెళ్లి వచ్చిన తర్వాత వరసగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీలో ఏదో జరిగి ఉంటుందన్న అనుమానం సొంత పార్టీ నేతలకే కలుగుతున్నాయి. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణి పోర్టల్ ను పక్కన పెట్టారు. నియంత్రిత సాగు విధానానికి స్వస్తి పలికారు.

జమిలీయే కారణమా?

ఇక తాజాగా ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణను చేర్చారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో కేసీఆర్ లో ఈ మార్పునకు జమిలి ఎన్నికలే కారణమన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 2022లో జమిలి ఎన్నికలు ఉంటాయని బీజేపీ పెద్దలు చెప్పడంతోనే కేసీఆర్ లో ఈ అనూహ్యమైన మార్పు వచ్చిందంటున్నారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డటం కూడా ఇందుకు కారణం కావచ్చని చెబుతున్నారు. మొత్తం మీద ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాతనే కేసీఆర్ లో ఈ మార్పు కన్పిస్తుంది.

Tags:    

Similar News