వ్యూహాత్మకమే.. సెంటిమెంట్ సెట్ చేస్తుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సెంటిమెంట్ తో పాటు పట్టభద్రులను ఆకట్టుకునే రీతిలో ఆయన అభ్యర్థిని ఎంపిక చేశారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి [more]

Update: 2021-03-05 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సెంటిమెంట్ తో పాటు పట్టభద్రులను ఆకట్టుకునే రీతిలో ఆయన అభ్యర్థిని ఎంపిక చేశారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి వాణిదేవిని ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో వాణిదేవి ఎంపిక పార్టీకి కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

శత జయంతి ఉత్సవాలు….

నిజానికి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ వాణిదేవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆమెను ఎమ్మెల్యే కోటాలో శాసనసమండలిలోకి పంపుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల భర్తీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను కేసీఆర్ బస్వరాజు సారయ్య, గోరంట్ల వెంకన్న తో పాటు వైశ్య సామాజికవర్గానికి కేటాయించారు. తాజాగా పట్టభద్రుల స్థానానికి వాణిదేవిని కేసీఆర్ ఎంపిక చేయడం వ్యూహాత్మకంగానే భావిస్తున్నారు.

వాణిదేవి ఎంపికలో….

మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానం నుంచి గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు విజయం సాధించారు. ఇద్దరూ ఒకరు వై‌శ్య, మరొకరు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ ఈక్వేషన్ తోనే కేసీఆర్ వాణిదేవిని ఎంపిక చేశారంటున్నారు. పీవీ నరసింహారావు తెలంగాణ నుంచి వెళ్లి ప్రధాని అయ్యారు. ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటున్నాయి.

చివరి క్షణంలో ఖరారు చేసి….

పీవీ నరసింహారావుకు సరైన నివాళి అర్పించాలంటే పీవీ కుమార్తె వాణిదేవిని గెలిపించాలన్న సెంటిమెంట్ తోనే కేసీఆర్ ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా నాగేశ్వర్ పోటీ చేస్తున్నారు. ఒకదశలో నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ భావించినా చివరి నిమిషంలో వాణిదేవిని ఎంపిక చేయడం పోటీ ఆసక్తికరంగా మారింది. వాణిదేవి గెలుపు బాధ్యతను ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు కేసీఆర్ అప్పగించారు.

Tags:    

Similar News