డోన్ దెబ్బతీయదన్న నమ్మకమేంటి?

డోన్ లో అడుగుపెట్టిన వేళా విశేషమోమో కాని కేఈ ప్రభాకర్ కు అన్నీ చేదు అనుభవాలే ఎదరవుతున్నాయి. దాదాపు పదహారేళ్ల తర్వాత చంద్రబాబు డోన్ బాధ్యతలను కేఈ [more]

Update: 2021-03-31 03:30 GMT

డోన్ లో అడుగుపెట్టిన వేళా విశేషమోమో కాని కేఈ ప్రభాకర్ కు అన్నీ చేదు అనుభవాలే ఎదరవుతున్నాయి. దాదాపు పదహారేళ్ల తర్వాత చంద్రబాబు డోన్ బాధ్యతలను కేఈ ప్రభాకర్ కు అప్పగించారు. అప్పటి వరకూ కేఈ సోదరుడు కేఈ ప్రతాప్ డోన్ బాధ్యతలను చూసేవారు. కానీ వరస ఓటములు ఎదురవ్వడం, ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపడంతో కేఈ ప్రభాకర్ కు డోన్ ఇన్ ఛార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు.

ఒకటిన్నర దశాబ్దం నుంచి…..

నిజానికి ఒకటిన్నర దశాబ్దం నుంచి కేఈ ప్రభాకర్ కు డోన్ తో సంబంధం లేదు. 1996లో జరిగిన ఉప ఎన్నికలలో కేఈ ప్రభాకర్ డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పడు చంద్రబాబు కేబినెట్ లో కేఈ ప్రభాకర్ మంత్రిగా కూడా పనిచేశారు. 1999 ఎన్నికల్లోనూ మరోసారి డోన్ నుంచి పోటీ చేసి కేఈ ప్రభాకర్ గెలుపొందారు. అప్పుడు కూడా చంద్రబాబు కేఈ ప్రభాకర్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

రెండు సార్లు గెలిచి…..

2004 ఎన్నికల్లోనూ డోన్ నుంచి టీడీపీ టిక్కెట్ ను కేఈ ప్రభాకర్ కు దక్కింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి డోన్ బాధ్యతలను ఆయన చూడటం లేదు. చంద్రబాబు ఆయన స్థానంలో సోదరుడు కేఈ ప్రతాప్ కు అప్పగించారు. 2014, 2019 ఎన్నికల్లో కేఈ ప్రతాప్ వరసగా ఓటమి పాలు కావడంతో డోన్ తనకు అచ్చిరాలేదని ఆయన పక్కకు తప్పుకున్నారు. దీంతో కేఈ ప్రభాకర్ కు చంద్రబాబు డోన్ బాధ్యతలను అప్పగించారు.

బాధ్యతలను తీసుకున్న తర్వాత…..?

కానీ కేఈ ప్రభాకర్ డోన్ బాధ్యతలను తీసుకున్న తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీకి విజయం దక్కలేదు. ఎమ్మెల్సీ గా ఉండటంతో కొంత కేఈ ప్రభాకర్ డోన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ క్యాడర్ లో ధైర్యం నింపేందుకు ప్రయత్నం చేశారు. అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. బలమైన ప్రత్యర్థి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఉండటంతో కేఈ ప్రభాకర్ కు కూడా ఈ నియోజకవర్గం అచ్చి వస్తుందో? లేదో? అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News