వీరిద్దరూ విలవిలలాడుతున్నారే?

కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కావాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నా [more]

Update: 2021-04-23 09:30 GMT

కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కావాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. రెండు చోట్ల బీజేపీయేతర ప్రభుత్వాలు ఉండటమే దీనికి కారణమంటున్నారు. ఆక్సిజన్, రెమిడెసివర్ మందుల కొరత తీవ్రంగా ఉందని పదే పదే ముఖ్యమంత్రులు విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

ఎన్ని విజ్ఞప్తులు చేసినా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో రోజుకు అరవై వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చివరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. మహారాష్ట్ర ఆర్థికంగా విలవిలలాడుతున్నా కేంద్రం నుంచి సహకారం లభించడం లేదని ఉద్ధవ్ థాక్రే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి…

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుంది. దీనిని అస్ధిర పర్చేందుకు ప్రయత్నించి బీజేపీ విఫలమయింది. అయితే పాలనాపరంగా ఇబ్బంది పెట్టాలన్న యోచనతోనే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కనీసం తమకు కావాల్సిన వైద్య సదుపాయాలను కల్పించడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

లాక్ డౌన్ వల్లనేనా?

మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే. ఢిల్లీలో కూడా కేసుల విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ కూడా లాక్ డౌన్ విధించారు. ఆక్సిజన్ కొరత, పడకల కొరత ఉందని చెబుతున్నా కేంద్రం నుంచి సహకారం లేదని కేజ్రీవాల్ విమర్శిస్తున్నారు. ఇద్దరు తమ మాట కాదని లాక్ డౌన్ విధించినందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కొరవడిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News