సంప్రదాయం ప్రకారమైతే.. పినరయి విజయన్ కు?
వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంట్ల ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కేరళ కుాడా కీలకమైనది. సంపూర్ణ అక్షరాస్వత, రాజకయ చైతన్యంగల ఈ [more]
వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంట్ల ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కేరళ కుాడా కీలకమైనది. సంపూర్ణ అక్షరాస్వత, రాజకయ చైతన్యంగల ఈ [more]
వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంట్ల ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కేరళ కుాడా కీలకమైనది. సంపూర్ణ అక్షరాస్వత, రాజకయ చైతన్యంగల ఈ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై అంతటా ఆసక్తి నెకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేత్ృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 140 స్ధానాలకుగాను ఈ కూటమి 2016 నాటి ఎన్నికల్లో 91 స్ధానాలను గెలుచుకుంది. ఇందులో సీపీఎం సొంతంగా 58, సిపిఐ 19 స్ధానాలను గెలుచుకున్నాయి. జనతాదళ్(ఎస్) 2 కుాటమిలోని చిన్నచితకా పార్టీలు మిగతా స్ధానాలను కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమెుక్రటిక్ ఫ్రంట్ ద్వితీయస్ధనంలో నిలిచింది. కాంగ్రెస్ 23, కూటమిలోని ఇండియన్ యునియన్ ఆఫ్ ముస్లిమ్ లీగ్ 18, కేరళ కాంగ్రెస్ ఎమ్ 6 స్ధానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో 1,25,10,581 మంది పురుష, 1,35,08,702 మంది ముస్లిమం ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు అధికం కావడం విశేషం.
కాంగ్రెస్ ధైర్యం అదే…..
వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనన్న ఆశాభావంతో హస్తం పార్టీ ఉంది. గెలుపు తధ్యమన్న ధీమాను కుాడా వ్యక్తం చేస్తోంది. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకసారి సిపిఎం కు, మరోసారి కాంగ్రెస్ కు పట్టం కట్టే సంప్రదాయం, ఆనవాయితీ రాష్ట్ర ఓటర్లకు ఉంది. ఈ పరిస్ధితి దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక రాజకీయంగా చూసినా కాంగ్రెస్ ఆశాభావంలో అర్ధమున్నట్లు కనపడుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయదుందుభి మోగించింది. మెుత్తం 20 స్ధానాలకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమెుక్రటిక్ ఫ్రంట్ 19 స్ధానాలను సాధించి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఏకంగా కాంగ్రెస్ 15 స్ధానాలను గెలుచుకుం.ది కూటమిలోని ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ 2, కేరళ కాంగ్రెస్ 1, ఆర్ ఎస్ పి ఒక్కోస్ధానాన్ని కైవశం చేసుకుంది. స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘వాయనాడ్’ లోక్ సభ స్ధానం నుంచి విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కోణంలో చుాసినపుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై హస్తం పార్టీ ఆశాభావంతో ఉండటం సహేతుకమే. హస్తం పార్టీ ఆశాభావానికి మరో కారణం కూడా ఉంది. సిపిఎం ఎమ్ ఎల్ ఎ లు ఆరుగురు, కాంగ్రెస్ ఎమ్ ఎల్ ఎ లు ముగ్గురు లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశారు. వీరిలో సిపిఎం అభ్యర్ధులు అయిదుగురు ఓడిపోగా, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించడం విశేషం. 2019 అక్టోబరులో జరిగిన అయిదు అసెంబ్లీ స్ధానాల ఉపఎన్నకల్లో కాంగ్రెస్ 3, సిపిఎం 2 స్ధానాలు సాధించాయి. ఆరూర్, మంజేశ్వర్, ఎర్నాకుళం స్ధానాల్లో కాంగ్రెస్, కొన్ను, వట్టిమెార్క స్ధానాల్లో సిపిఎం విజయం సాధించాయి.
అయిగే గ్రూపు తగాదాలు……
లోక్ సభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన హస్తం పార్టీ సరిస్ధితి ఆశాభావంగానే ఉందనడం తొందరపాటు అవుతుంది. పార్టీలోని వర్గరాజకీయాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న భయం లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, పిసిసి చీఫ్ ముళ్ళపళ్ల రామచంద్రన్, సిఎల్ పి లీడర్ రమేష్ చెన్నితాల సిఎం పీఠం కోసం పోటిపడుతున్నారు. సిఎం పదవి రాకుండా పరస్పరం అడ్డుకనేందుకు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. ఉమెన్ చాందీ ఒక దఫా సిఎం గా వ్యవహరించినందున తమ ఇద్దరి లో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలన్నది రామచంద్రన్, రమేశ్ చెన్నితాల అభిప్రాయంగా ఉంది. స్వయంగా యువరాజు రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున సమస్యను సామరస్యంగా పరిష్కరించగలరన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.
సీపీఎంలోనూ అంతే…..
అధికార సిపిఎం అనేక ఎదురుదెబ్బలు తగిలినప్పటికి తమ విజయావకాశాలు బాగానే ఉన్నాయని చెబుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వ సామర్ధ్యం, మచ్చలేని పాలన, ఇటీవల కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్న తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పార్టీ చెబుతోంది. దానిని తోసిపుచ్చలేం. అయితో అదేసమయంలో మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, ప్రస్తుత సిఎం పినరయి విజయన్ వర్గాల పోరు విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ తరపున గల ఏకైక ఎమ్ఎల్ఎ ఓ. రాజగోపాల్ గట్టిపోటీ ఇస్తామని పైకి బింకాలు పలుకుతున్నప్పటికి అంత సీన్ లేదన్నది వాస్తవం. మెున్నమెున్నటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విస్.శ్రీధరన్ పిళ్ళై మిజోరం గవర్నరుగా నియమితులవడంతో ఆయనస్ధానంలో కె.సురేంద్రన్ నియమితులయ్యారు. 2016 లో అయిదు స్ధానాల్లో పోటీచేసిన పార్టీ ఒక స్ధానంలో గెలవగా, రెండుస్ధానాల్లో రెండోస్ధానంలో నిలచింది. ప్రస్తుత పరిస్ధితి ప్రకారం చూస్తే. హస్తం పార్టీ విజయావకాశాలను తోసిపుచ్చడం కష్టమే.
-ఎడిటోరియల్ డెస్క్