ఈసారి హోరా హారీయేనా? వన్ సైడ్ అవుతుందా?

మరికొద్ది నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే సంప్రదాయం ప్రకారం ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి పరాజయం తప్పదు. ఇప్పుడు సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ [more]

Update: 2021-01-27 17:30 GMT

మరికొద్ది నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే సంప్రదాయం ప్రకారం ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి పరాజయం తప్పదు. ఇప్పుడు సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ పనితీరు అందరి ప్రశంసలను అందుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ అధికారంపై బాగా ఆశలు పెట్టుకుంది. పినరయి విజయన్ ను లక్ష్యంగా చేసుకుని గత రెండేళ్లుగా విమర్శలను చేస్తూ వస్తుంది.

ద్విముఖ పోటీ అయినా…

140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ రాష్ట్రంలో గత ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ సాధించి ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. యూడీఎఫ్ కేవలం 47 స్థానాలకే పరిమితమయింది. బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ కూడా కొంత బలం పుంజుకుంది. అయితే అది కాంగ్రెస్ కే నష్టం జరగవచ్చన్న అంచనా విన్పిస్తుంది. నిజానికి పోటీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల మధ్యనే ఉండనుంది. విజేత ఎవరన్నది మాత్రం అస్పష్టతగానే ఉంది.

అదే కొంత ధైర్యం….

ఇటీవల కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్టీఎఫ్ ఘన వియం సాధించింది. ప్రజల ఆలోచనలు పినరయి విజయన్ వైపు ఉన్నాయని ఈ ఫలితాలను బట్టి స్పష్టమవుతుంది. అభివృద్ధి విషయంలో పినరయి విజయన్ రాజీపడలేదు. అలాగే విపత్తులను కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోయినా అందరికంటే ముందుగా ప్రజలకు అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చింది పినరయి విజయన్ మాత్రమే కావడం విశేషం. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన బాట పట్టారు.

మరోసారి అధికారం….?

వరదల సమయంలోనూ, కరోనా, నిఫా వైరస్ విషయంలోనూ పినరయి విజయన్ తీసుకున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు అందుకున్నాయి. 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి ప్రజలకు ధైర్యం చెప్పగలిగారు. కేరళలో అత్యధికమంది చదువుకున్న వారు కావడంతో మరోసారి విజయన్ కే అవకాశాలున్నాయంటున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోవడం యూడీఎఫ్ కు మైనస్ గా మారనుందని చెబుతున్నారు. గోల్డ్ స్కాం ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపకపోవడంతో ఈసారి విజయం తమదేనన్న ధీమా ఎల్డీఎఫ్ లో కన్పిస్తుంది.

Tags:    

Similar News