జగన్ కి పోటీగా అచ్చెన్న

జగన్ ప్రతిపక్షంలో ఉండగా నాడు మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు దూకుడు ఓ రేంజిలో ఉండేది. అచ్చెన్న జగన్ మీద మాటలతో దూసుకువచ్చేవారు. దారుణంగా కామెంట్స్ చేసేవారు. ఓ [more]

Update: 2020-02-25 00:30 GMT

జగన్ ప్రతిపక్షంలో ఉండగా నాడు మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు దూకుడు ఓ రేంజిలో ఉండేది. అచ్చెన్న జగన్ మీద మాటలతో దూసుకువచ్చేవారు. దారుణంగా కామెంట్స్ చేసేవారు. ఓ విధంగా అచ్చెన్న కామెంట్స్ వైసీపీ ఎమ్మెల్యేలను దారుణంగా బాధించి వారు సభలో అల్లరి చేస్తే దాన్ని కూడా చంద్రబాబు అనుకూలంగా మార్చుకుని విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేవారు. ఇలా తన హయాంలో అచ్చెన్నను ఆయుధంగా చేసుకున్నారు. ఇపుడు కూడా ప్రతిపక్షంలోనూ అచ్చెన్న నోటికే చంద్రబాబు పెద్ద పని అప్పగించారు. ఇవన్నీ ఇలా ఉంటే అచ్చెన్నని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని బాబు దాదాపుగా డిసైడ్ అయిపోయారట‌.

బీసీ నేతగా…?

విశాఖలో క్యాపిటల్ రావడం తధ్యం. దీంతో ఉత్తరాంధ్రలో పార్టీని కాపాడుకోవడంతో పాటు, వైసీపీ సర్కార్ ని కూడా ఇరుకున పెట్టేందుకు అచ్చెన్న లాంటి పెద్ద పర్సనాలిటీకే పార్టీ పదవి ఇవ్వాలని బాబు భావిస్తున్నారుట. ఆ విధంగా చేయడం వల్ల అచ్చెన్న ధాటికి వైసీపీ మళ్ళీ విలవిలలాడుతుందని, పార్టీకి మైలేజ్ దక్కుతుందని కూడా ఆలోచిస్తున్నారుట. అచ్చెన్న అయితే పెద్ద నోరుతో జగన్ సర్కార్ ని ఓ ఆట ఆడుకుంటారని బాబు గారి నమ్మకమట. మరి ఆయన చెడుగుడే ఆడతారో లేక పార్టీకి ఏమేం చేస్తారో తెలియదు కానీ కింజరపు ఫ్యామిలీ మీద మాత్రం బాబులిద్దరికీ ఇపుడు బాగా గురి కుదిరిందిట.

కళాకు అలా చెక్….

ఇక ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా, హోం మంత్రిగా కూడా పనిచేసిన కిమిడి కళా వెంకటరావు తెలుగుదేశంలో మూడు తరాలను చూశారు. అన్న నందమూరితో సాన్నిహిత్యంతో యవ్వనంలోనే మంత్రి పదవి దక్కగా, చంద్రబాబు జమానాలోనూ మంత్రిగా పనిచేసి కీలక నేతగా ఎదిగారు. ఇక విభజన ఏపీకి ఆయన తొలి టీడీపీ అధ్యక్షుడు. పేరుకు అధ్యక్షుడే కానీ నారా పుత్రరతం లోకేష్ మాట వింటారని, ఇద్దరు బాబులూ చెప్పినట్లుగా చేస్తారని తమ్ముళ్ళు అంటారు. ఇక చంద్రబాబే పేరుకు జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు. దాంతో ఆయనే మొత్తం ఏపీ వ్యవహారాలు చక్కబెట్టేస్తూంటే కళా కాంతులు లేకుండా కిమిడి వారు ప్రకటనలూ , ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారన్న టాకూ ఉంది.

సేవలు ఇక చాలా….

ఇక ఆయన సేవలు చాలూ అనుకుంటున్నారో, బాగాలేవనుకున్నారో తెలియదు కానీ ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఇపుడు కొత్త కామందుని ముందుకు తెస్తున్నారుట. అదీ శ్రీకాకుళం జిల్లా నుంచేనట. కళా కంటే జోరు పెంచి బాబుకు బాగా దగ్గరైపోయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కొత్త టీడీపీ అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కళాకు అచ్చెన్నకు జిల్లాలోనే పెద్ద పోటీ ఉంది. అయితే నిన్నటి జగన్ ప్రభంజనంలో గెలిచి మరీ వీరుడైపోయిన అచ్చెన్న ఇపుడు బాబుకు బాగా పనికొచ్చే నేతగా కనిపిస్తున్నారు. పైగా ఏపీ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయిన కళా పార్టీకి పెద్ద బరువుగా తోస్తున్నారులా ఉంది. అందుకే ఆయన్ని తప్పించి అచ్చెన్నకు పార్టీ పగ్గాలు అప్పగించాలని బాబు గారు ఆలోచిస్తున్నారుట. మరి ఉన్న నామమాత్రపు పదవీ కూడా పోతే ఇకపై కళా ప్రెస్ మీట్లకు, ప్రెస్ నోట్లకూ కూడా పెద్దగా విలువుండదేమో. చూడాలి మరి.

Tags:    

Similar News